కలుషిత నీటితో చర్మ రోగాలు.. డెర్మటాలజిస్ట్‌ హెచ్చరిక

కలుషిత నీటితో చర్మ రోగాలు, ఇన్ఫెక్షన్‌లు సోకే ప్రమాదాలు ఉన్నాయని ప్రముఖ డెర్మటాలజిస్ట్‌ స్వప్న ప్రియ అన్నారు. తామర, ఇంటర్ ట్రిగో, ప్రూ రైగో, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎక్తైమా,

  • Manju Sandulo
  • Publish Date - 10:16 am, Fri, 23 October 20

Skin Infections Polluted water: కలుషిత నీటితో చర్మ రోగాలు, ఇన్ఫెక్షన్‌లు సోకే ప్రమాదాలు ఉన్నాయని ప్రముఖ డెర్మటాలజిస్ట్‌ స్వప్న ప్రియ అన్నారు. తామర, ఇంటర్ ట్రిగో, ప్రూ రైగో, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఎక్తైమా, ఇన్ సెక్ట్స్ బైట్ రియాక్షన్స్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వీలైనంత వరకు వరదలోని మురుగు నీటికి దూరంగా ఉంటే మంచిదని ఆమె చెబుతున్నారు. ముఖ్యంగా షుగర్ పేషెంట్లు గాయాలు కాకుండా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఒకవేళ నీటిలోకి వెళ్లాల్సి వస్తే తర్వాత శుభ్రంగా కడిగి పొడి బట్టలు వేసుకోవాలని, బురద ఇంటిని శుభ్రం చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్న పిల్లలు, వృద్ధుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. కాళ్లకి దురద, పుండ్లు లాంటివి వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని స్వప్న ప్రియ చెబుతున్నారు.

Read More:

ఏపీలో రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ భేటీ

కరోనా అప్‌డేట్స్‌: తెలంగాణలో కొత్తగా 1,412 పాజిటివ్ కేసులు