Lord Shiva: శివయ్యకు ఇష్టమైన రాశులు ఇవే.. భోలాశంకరుడు అనుగ్రహం, ప్రత్యేక ఆశీర్వాదం వీరి సొంతం..
త్రిమూర్తులలో లయకారుడు మహాదేవుడుని అత్యంత భక్తిశ్రద్దలతో పూజిస్తారు. కేవలం జలంతో కోరి కొలిస్తే భక్తులు కోరిన కోర్కెలు తీరుస్తాడని నమ్మకం. అంతేకాదు మహా దేవుడిని పూజించడం వలన జాతకంలో గ్రహాల దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. అటువంటి శివయ్యకు ఇష్టమైన రాశులున్నాయని మీకు తెలుసా..

మహాదేవుడిని ప్రతి రోజూ ఇంటిలో పూజించే భక్తులున్నారు. శివుడిని పూజించడం ద్వారా భక్తుడి సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. శివుడిని పూజించడం వలన జీవితంలో కలిగే ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి. కష్టాలు తీరతాయని.. ఆరోగ్యాన్ని ఇస్తాడని నమ్ముతారు.
హిందూ మత గ్రంథాలలో శివుడిని పూజించడం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. శివుడికి చేసే పూజ, ఉపవాసం నిర్మలమైన హృదయంతో చేస్తే.. భక్తుడు తనకు కావలసిన జీవిత భాగస్వామిని పొందుతాడని నమ్ముతారు. శివుడు తన భక్తులందరిపై తన ఆశీస్సులను కురిపిస్తాడు. అయితే శివుడికి చాలా ప్రియమైన కొన్ని రాశులు ఉన్నాయి. జ్యోతిష విశ్వాసాల ప్రకారం మహా దేవుడు ఎల్లప్పుడూ తన ప్రియమైన రాశులను రక్షిస్తాడు. ప్రతి కష్టం నుంచి భక్తులను రక్షిస్తాడు. అటువంటి పరిస్థితిలో ఈ రోజు శివయ్యకు ఇష్టమైన రాశుల గురించి తెలుసుకుందాం..
మేష రాశి: మహాదేవుని ఆశీస్సులు మేష రాశి వారిపై ఎల్లప్పుడూ ఉంటాయి. శివయ్య ఆశీస్సులతో వీరు తమ కెరీర్‌లో విజయం సాధిస్తారు. వ్యాపారంలో కూడా ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి.
తుల రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులపై శివుని ఆశీర్వాదాలు లభిస్తాయి. శివుని ఆశీస్సులతో ఈ రాశి వారు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. అలాగే మహాదేవుడు వీరి భక్తికి సంతోషిస్తాడు. వరాలను కురిపిస్తాడు.
మకర రాశి: ఈ రాశి మహాదేవుడికి ఇష్టమైన రాశులలో ఒకటి. జ్యోతిషశాస్త్రం ప్రకారం మకర రాశి అధిపతి శనీశ్వరుడు. శివుడికి భక్తుడు శనీశ్వరుడు. కనుక ఈ రాశి వారిపై శంకరుని ప్రత్యేక ఆశీర్వాదం ఉంటుంది. ఇది వీరి భౌతిక సౌకర్యాలను కూడా పెంచుతుంది.
కుంభ రాశి: మహాదేవుడికి ఇష్టమైన రాశుల్లో కుంభ రాశి. ఈ రాశికి చెందిన వ్యక్తులపై మహా దేవుడి ఆశీస్సులు ఉంటాయి. దీని కారణంగా ఈ రాశికి చెందిన వ్యక్తులు జీవితంలో విజయం సాధిస్తారు. నియమాల ప్రకారం శివుడిని పూజిస్తే.. వీరు కోరుకున్న ఫలితాలను పొందుతారని నమ్మకం.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.