Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kuja Dosha Remedies: జాతకంలో కుజ దోషమా.. లక్షణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నివారణలు ఏమిటంటే

జ్యోతిష్య శాస్త్రంలో నవ గ్రహాల్లో కుజుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఎవరి జాతకంలోనైనా కుజుడు లేదా అంగారకుడు స్థానం బలంగా ఉంటే అతని జీవితంలో సంతోషం, ధైర్యం ఉంటాయి. అదే సమయంలో వ్యక్తి జాతకంలో 1వ, 2వ, 4వ, 7వ, 8వ లేదా 12వ ఇంట్లో ఉంటే కుజుడు ఉంటే కుజ దోషం ఏర్పడుతుంది. దీనినే మంగళ దోషం అని కూడా అంటారు. ఈ రోజు కుజ దోషం ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటో తెలుసుకుందాం..

Kuja Dosha Remedies: జాతకంలో కుజ దోషమా.. లక్షణాలు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నివారణలు ఏమిటంటే
Kuja Dosha Remedies
Follow us
Surya Kala

|

Updated on: Apr 15, 2025 | 7:17 AM

వ్యక్తి జాతకంలో కుజుడు కొన్ని ప్రత్యేక ఇంట్లో ఉన్నప్పుడు మంగళ దోషం సంభవిస్తుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం కుజుడు మొదటి, నాల్గవ, ఏడవ, ఎనిమిదవ లేదా పన్నెండవ ఇంట్లో ఉంటే అప్పుడు మంగళ దోషం అంటారు. జ్యోతిష విశ్వాసాల ప్రకారం ఈ స్థానాలు వ్యక్తి వైవాహిక జీవితం, సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఎందుకంటే జ్యోతిష్యం ప్రకారం మంగళ దోషం వివాహానికి, వైవాహిక జీవితానికి మంచిది కాదు. కొంతమంది జ్యోతిష్కులు చంద్రుడు, సూర్యుడు, శుక్రులకు సంబంధించి కుజుడి స్థానాన్ని పరిశీలించడం ద్వారా కూడా ఈ దోషాన్ని పరిగణిస్తారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం మంగళ దోష ప్రభావాలు.. దోష నివారణల గురించి తెలుసుకుందాం.

జ్యోతిషశాస్త్రం ప్రకారం, మంగళ దోష ప్రభావాలు

వివాహంలో జాప్యం లేదా అడ్డంకులు.. మంగళ దోషం కారణంగా వివాహం ఆలస్యం కావచ్చు లేదా సంబంధాలు తెగిపోవచ్చు.

వైవాహిక జీవితంలో సమస్యలు.. భార్యాభర్తల మధ్య సమన్వయ లోపం, విభేదాలు, తగాదాలు, ఉద్రిక్తత ఉండవచ్చు. సమస్యలు తీవ్రమైన సందర్భాల్లో.. భార్యాభర్తలు విడిపోయి దూరంగా ఉండే పరిస్థితి లేదా విడాకులు తీసుకునే పరిస్థితి కూడా తలెత్తవచ్చు.

ఇవి కూడా చదవండి

కోపం, అహంకార స్వభావం.. మంగళ దోషం ఉన్న వ్యక్తి కోపంగా, చిరాకుగా, అహంకారపూరిత స్వభావాన్ని కలిగి ఉంటాడు. దీనివల్ల కుటుంబ సభ్యులతో సంబంధాలు కూడా చెడిపోతాయి.

ఆర్థిక సమస్యలు.. రుణ భారం లేదా ఆస్తికి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు.

ఆరోగ్య సమస్యలు.. శారీరక సామర్థ్యాలు తగ్గవచ్చు, వ్యాధుల వల్ల సమస్యలు ఉండవచ్చు. ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంది.

కుటుంబ కలహాలు.. మంగళ దోషాన్ని నివారించడానికి జ్యోతిష పరిహారాలు

కుండలి సరిపోలిక.. వివాహానికి ముందు, వధూవరుల జాతకాలను సరిపోల్చుకోండి. ఇద్దరి జాతకంలోనూ మంగళ దోషం ఉన్నట్లు అయితే మంగళ దోషం ప్రతికూల ప్రభావం తగ్గుతుంది.

మంగళ శాంతి పూజ: కుజుడి శాంతి కోసం పూజ, హవనాన్ని నిర్వహించండి. ఈ కార్యక్రమాన్ని అర్హత కలిగిన పండితుడి చేత సరిగ్గా చేయించాలి.

హనుమంతుడికి పూజ.. ప్రతి మంగళవారం ఉపవాసం ఉండండి. హనుమంతుడి ఆలయానికి వెళ్లి బూందీ ప్రసాదం సమర్పించండి. హనుమాన్ చాలీసా లేదా సుందరకాండ పఠించండి.

రత్నం ధరించడం.. జ్యోతిష్యుడి సలహా మేరకు పగడపు రత్నం (ఎరుపు రంగు) ధరించండి. మూడు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల మంగళ దోషం తగ్గుతుంది.

మంగళ యంత్ర పూజ.. ఇంట్లో మంగళ యంత్రాన్ని ప్రతిష్టించి, దానిని క్రమం తప్పకుండా పూజించండి.

వీటిని దానం చేయండి: మంగళవారం రోజున ఎరుపు రంగు దుస్తులు, ఎరుపు రంగు స్వీట్లు, పప్పు, ఎర్ర చందనం, ఎరుపు రంగు పువ్వులు దానం చేయండి.

వేప చెట్టు నాటడం.. జాతకంలో మంగళ దోషం ఉంటే వివాహానికి ముందు వేప చెట్టును నాటి 43 రోజులు ఆ వేప చెట్టుని జాగ్రత్తగా చూసుకోండి.

రావి చెట్టుతో లేదా శాలిగ్రామ వివాహం ..కొన్ని ప్రత్యేక పరిస్థితులలో జ్యోతిష్కులు అబ్బాయి లేదా అమ్మాయికి రావి చెట్టుతో లేదా సాలగ్రామంతో ప్రతీకాత్మకంగా వివాహం చేసుకోవాలని సూచిస్తారు.

వెంకటేశ్వర స్వామికి సింధూరం సమర్పించండి.. హనుమంతునితో పాటు, వెంకేశ్వరస్వామికి కుంకుమను సమర్పించడం కూడా ప్రయోజనకరం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.