Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Second Lunar Eclipse: ఏడాదిలో రెండో చంద్ర గ్రహణం ఎప్పుడు? మన దేశంలో కనిపిస్తుందా! లేదా.. సూత కాలం గురించి తెలుసుకోండి..

2025 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మార్చి 14న ఏర్పడింది. ఇప్పుడు ప్రజలు ఈ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తదుపరి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందో లేదో తెలుసుకోవడానికి కూడా ఆసక్తిగా ఉన్నారు. 2025 సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం ఎప్పుడు సంభవిస్తుంది.. అది భారతదేశంలో కనిపిస్తుందో లేదో ఈ రోజు తెలుసుకుందాం..

Second Lunar Eclipse: ఏడాదిలో రెండో చంద్ర గ్రహణం ఎప్పుడు? మన దేశంలో కనిపిస్తుందా! లేదా.. సూత కాలం గురించి తెలుసుకోండి..
Second Lunar Eclipse 2025
Follow us
Surya Kala

|

Updated on: Apr 15, 2025 | 7:40 AM

2025 సంవత్సరంలో నాలుగు గ్రహణాలు ఏర్పడతాయి. వాటిలో రెండు ఇప్పటికే సంభవించాయి. ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం మార్చి 14న సంభవించగా, సూర్యగ్రహణం మార్చి 29న అమావాస్య నాడు సంభవించింది. అయితే ఈ రెండు గ్రహణాలు భారతదేశంలో కనిపించలేదు. ఇప్పుడు ప్రజలు తదుపరి రెండు గ్రహణాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తదుపరి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందో లేదో తెలుసుకోవడానికి కూడా ఆసక్తిగా ఉన్నారు. ఈ నేపధ్యంలో సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది? భారతదేశంలో ఈ ఖగోళ సంఘటన ప్రభావం ఉంటుందా లేదో తెలుసుకుందాం..

2025 సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుందంటే

ఈ సంవత్సరంలో రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 7, 2025న ఏర్పడనుంది. అంటే రెండవ చంద్ర గ్రహణం భాద్రపదమాసం పౌర్ణమి రోజున ఏర్పడనుంది. ఈ ఏడాది రెండవ చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రి 9:57 గంటలకు ప్రారంభమై సెప్టెంబర్ 8న తెల్లవారుజామున 12:23 గంటల వరకు ఉంటుంది.

ఈ సంవత్సరం రెండవ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుందా?

ఈ సంవత్సరం తొలి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించలేదు. అయితే ఈ సంవత్సరం రెండవ చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది. కనుక మన దేశంలో రెండో చంద్ర గ్రహణం కనిపిస్తుంది. దీని సూతక కాలం కూడా చెల్లుతుంది. గ్రహణానికి 8 గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం రెండవ చంద్రగ్రహణం భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా, అంటార్కిటికా, పసిఫిక్ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రంలోని కొన్ని ప్రాంతాలలో కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

గ్రహణ సూతకం ప్రారంభమైనప్పుడు ఏమి చేయాలి?

  1. సూతక కాలంలో ఎటువంటి శుభకార్యాలు లేదా పూజలు చేయకూడదు.
  2. సూతక కాలంలో పురాణ గ్రంథాలను పారాయణం చేయాలి.
  3. సూతక కాలంలో భగవంతుడిని ధ్యానించి, మంత్రాలను జపించాలి.
  4. సూతక కాలంలో గర్భిణీ స్త్రీ బయటకు వెళ్లకూడదు.
  5. సూతక కాలం ప్రారంభమయ్యి..ముగిసే వరకూ ఆహారం వండకూడదు లేదా తినకూడదు.
  6. గ్రహణానికి ముందు తయారుచేసిన ఆహారంపై తులసి దళాలతో లేదా, దర్భ గడ్డిని నిల్వ చేసి ఉండాలి.
  7. సూతక కాలం ముగిసిన తర్వాత స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసి గంగా జలాన్ని చల్లుకోవాలి.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.