Shani Transit 2026: 2026లో శనీశ్వర సంచారం.. తేదీ, సమయాన్ని ప్రకటించిన తిరునల్లార్ ఆలయ సిబ్బంది..
తమిళనాడులోని తిరునల్లార్ శనీశ్వర ఆలయం చాలా పసిద్ది చెందింది. ఈ ఆలయ పరిపాలన సిబ్బంది 2026 లో శనీశ్వరుడు తన రాశిని మార్చుకోనున్నాడని అధికారికంగా ప్రకటించింది. ఆ సమయంలో శనీశ్వరుడు కుంభ రాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తాడని వెల్లడించింది. ఇలా శనీశ్వరుడు రాశిని మార్చుకునే సమయంలో మొత్తం 12 రాశుల వారిపై సానుకూల, ప్రతికూల ప్రభావాలను చూపుతుందని చెప్పారు.

తమిళనాడు కారైకాల్ జిల్లాలోని ప్రసిద్ధ చెందిన తిరునల్లార్ శనీశ్వర ఆలయం దేశ వ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. నవ గ్రహాల్లో శనీశ్వరుడు కర్మ ప్రధాత, న్యాయాధిపతి. శనీశ్వరుడు తిరునల్లార్ ఆలయ పరిపాలన 2026 లో శనీశ్వరుడు రాశిని మార్చుకోనున్నాడని ప్రకటించింది. దీంతో శని సంచారంపై భక్తులలో ఉన్న గందరగోళం తొలగిపోయింది. జ్యోతిషశాస్త్రంలో వివరించిన విధంగా మానవ జీవితం తొమ్మిది గ్రహాల సంచారంపై ఆధారపడి ఉంటుందని సాధారణంగా నమ్ముతారు. ఈ గ్రహాలు, వ్యక్తిగతంగా లేదా సమూహాలలో మొత్తం 12 రాశుల్లో సంచరిస్తూ ఉంటాయి. ఇలా గ్రహాలు రాశులను మార్చుకునే సమయంలో వివిధ అనుకూలమైన, ప్రతికూల ప్రభావాలు సంభవిస్తాయి. ఈ గ్రహాలు సాధారణంగా ఒక్కో రాశిలో రోజులు, నెలలు, సంవత్సరాలు సంచరిస్తాయి. అంటే తొమ్మిది గ్రహాలలో సూర్యుడు, చంద్రుడు, బుధుడు, బృహస్పతి, కుజుడు, శనీశ్వరుడు, శుక్రుడు, రాహువు, కేతువులు ఒక రాశి నుంచి మరొక రాశిలో ప్రవేశించే సమయం కంటే శనీశ్వరుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి అడుగు పెట్టేందుకు పట్టే సమయం అతి సుదీర్ఘం. దీంతో శనీశ్వరుడు మాత్రమే ఒకే రాశిలో ఎక్కువ కాలం సంచరించే ఏకైక గ్రహం.
ఆ విధంగా శనీశ్వరుడు ఒక రాశిలోకి ప్రవేశిస్తే.. ఆ రాశిలో దాదాపు రెండున్నర ఏళ్ళు అదే రాశిలో ఉంటాడు. ఈ సమయంలో జీవితంలో వివిధ మార్పులు వస్తాయి. శని సంచారం జ్యోతిషశాస్త్రంలో అత్యంత ముఖ్యమైనది. శనీశ్వరుడు ఇచ్చేవాడు, నాశనం చేసేవాడు అనే సామెత ఉంది. కనుక శని సంచార సమయంలో కొన్ని రాశుల వారికి కొంత ప్రయోజనాలు.. కొన్ని రాశులకు ఇబ్బందులను తీసుకుని రావడం సహజం.
శనీశ్వర సంచారం ఇప్పటికే జరిగిందని కొందరు పండితులు చెబుతున్నారు.. అంతేకాదు దీని గురించిన వార్తలు, జాతక ఫలితాలు, భవిష్యత్తు అంచనాలు విడుదలయ్యాయి. శనీశ్వర కదలిక ఆధ్యాత్మిక కోరికలు ఉన్నవారిలో ఉత్సాహాన్ని స్తుష్టిస్తుంది. అయితే మార్చి 25, 2025న కారైకల్ జిల్లా తిరునల్లార్‌లోని శనీశ్వర ఆలయంలోని పరిపాలన యంత్రాంగం ఈ సంవత్సరం శని సంచారము ఉండదని అకస్మాత్తుగా ప్రకటించింది. ఇంకా ద్రుక్ పంచాంగం ప్రకారం.. 026 లో శని సంచారము జరుగుతుందని ప్రకటించింది.
ఈ పరిస్థితిలో తిరునల్లార్ శని భగవాన్ ఆలయ పరిపాలన మార్చి 6, 2026న శని పెయార్చి జరుగుతుందని ప్రకటించింది. ఆ రోజు ఉదయం 8.24 గంటలకు శనిదేవుడు కుంభ రాశి నుండి మీన రాశిలోకి ప్రవేశిస్తాడని కూడా నివేదించింది. దీని కారణంగా భక్తులు శని సంచారంపై ఏర్పడిన గందరగోళం నుంచి బయటప పడి స్పష్టత పొందారు. శని సంచార సమయంలో ఒక నిర్దిష్ట రాశి నుంచి మరొక రాశికి వెళ్ళే శనీశ్వరుడు శని దోషం, ఏలినాటి శని, శని దైయ వంటి ప్రభాన్ని కొన్ని రాశులపై చూపిస్తాడు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.