Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Astro Tips: విద్య, వ్యాపారాభివృద్ధి కోసం బుధుడి అనుగ్రహం తప్పని సరి.. ప్రసన్నం కోసం ఈ పరిహారాలు చేసి చూడండి..

వేద జ్యోతిషశాస్త్రంలో నవ గ్రహాల్లో బుధుడిని యువరాజుగా పరిగణిస్తారు. బుధుడిని తెలివితేటలు, వ్యాపారానికి ప్రతీకగా భావిస్తారు. నవ గ్రహ రాజ్యంలో బుధుడికి యువరాజు హోదా దక్కింది. దీంతో ఈ విశ్వం నడిచేందుకు బుధుడికి ప్రత్యేక సహకారం ఉందని అర్థం. కనుక బుధుడిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని ఉత్తమ పరిహరలున్నాయని పండితులు సూచిస్తున్నారు. అవి ఏమిటో తెలుసుకుందాం..

Astro Tips: విద్య, వ్యాపారాభివృద్ధి కోసం బుధుడి అనుగ్రహం తప్పని సరి.. ప్రసన్నం కోసం ఈ పరిహారాలు చేసి చూడండి..
Prince Of The Planet
Follow us
Surya Kala

|

Updated on: Apr 15, 2025 | 1:50 PM

మనిషి జాతకంలో బుధుడు తరచుగా నవ గ్రహాలకు అధినేత సూర్యుడితోనే ఉండడం కనిపిస్తుంది. అయితే ఏ గ్రహం అయినా సూర్యుడికి దగ్గరగా ఉంటే ఆ గ్రహ ప్రకాశం అంత మసకగా మారుతుందని చెబుతారు. దీని అర్ధం ఏమిటంటే.. సూర్యుని కాంతి వలయం బలమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది. కనుక గ్రహ ప్రభావం తగ్గుతుంది. అయితే బుధుడు..తరచుగా సూర్యుడికి దగ్గరగా కనిపిస్తాడు. ఈ సమయంలో చాలా మంది జాతకాలపై ప్రభావం చూపుతుంది. ఇది జాతకంలో తండ్రి కొడుకుల సంబంధం ప్రత్యేక శక్తిని ఇస్తుందని సూచిస్తుంది. ముఖ్యంగా జనన కుండలి సమయంలో మరే ఇతర లోపం లేనప్పుడు. తండ్రి కొడుకుల సంబంధంపై ప్రభావం చూపిస్తుంది.

బుధుడు విద్యకు కారకుడు.

వేద జ్యోతిషశాస్త్రంలో బుధుడు విద్యకు కారకుడని చెప్పబడింది. ఇది వ్యాపారంలో కూడా ఒక ముఖ్యమైన సహకారాన్ని కలిగి ఉంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం బుధ గ్రహం తెలివితేటలు, తర్కం, వాక్చాతుర్యం, కమ్యూనికేషన్, వ్యాపారం, చర్మం, అందం, స్నేహానికి కారకుడు. బుధుడిని గ్రహాల రాకుమారుడు అంటారు. బుధుని వింషోత్తరి దశ 17 సంవత్సరాలు. ఒక వ్యక్తి వయస్సు ప్రకారం అతని జాతకంలో, అతను విద్యను అభ్యసిస్తున్నప్పుడు, ఆ సమయంలో జాతకంలో బుధునితో మంచి సంబంధం లేని లేదా సహజ ప్రయోజనాలతో బుధునితో సంబంధాన్ని ఏర్పరుచుకునే ఏదైనా గ్రహ పరిస్థితి వస్తే. బుధుని సాపేక్ష బలం బాగుంటే, జన్మ జాతకం, నవజ కుండలి, వర్గ కుండలిలో బుధుని స్థానం బలంగా ఉంటే, శుభ గ్రహాలతో దీని సంబంధం బాగుంటే.. దీని ప్రభావం బాగుంటుందని అర్థం. గ్రహాలతో సంబంధం వ్యతిరేకమైతే దాని ప్రభావం మంచిది కాదు.

బుధుడిని ప్రసన్నం చేసుకునేందుకు మార్గాలు

  1. బుధుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఇది మొదటి మార్గం. త్రిమూర్తులలో లోక రక్షకుడు విష్ణువును పూజించండి. అయ్యప్పను పూజించండి.
  2. దేవతలలో త్రిపుర దేవిని, సుందరి దేవిని నిరంతరం పూజించండి.
  3. ఇవి కూడా చదవండి
  4. బుధ గ్రహం నుంచి శుభ ఫలితాల కోసం.. దుర్గా సప్తశతి పారాయణం చేయాలి.
  5. బుధుడు కారకుడైన ఆ కారకాన్ని సంతోషపెట్టడాన్ని గ్రహ పూజ అని కూడా అంటారు.
  6. ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి. ఆకుపచ్చ రంగుకి సంబందించిన వస్తువులను ఉపయోగించడం మొదలు పెట్టండి.
  7. ముఖ్యంగా రోజూ మొక్కలకు సేవ చేయండి.
  8. ఆవుకు క్రమం తప్పకుండా మేత పెట్టండి. ఇది సాధ్యం కాకపోతే ముఖ్యంగా బుధవారం రోజున ఆవుకు ఆహారం పెట్టండి.
  9. బుధుడిని ప్రసన్నం చేసుకోవడానికి, పచ్చ గడ్డి, పెసర పప్పులు, పాలకూర, నీలిరంగు పువ్వులు, పచ్చని బట్టలు, కాంస్య పాత్రలు, ఏనుగు దంతాలతో చేసిన వస్తువులను దానం చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది.
  10. ప్రతిరోజు బుధవారం రోజూ బాలికలను పూజించి వారికి విద్యా సామగ్రిని అందించడం శుభప్రదం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.