- Telugu News Photo Gallery Palitana: First city in the world to ban non vegetarian food, know the details
Vegetarian City: ప్రపంచంలోనే మొదటి శాఖాహార నగరం ఎక్కడ ఉందో తెలుసా.. ఎందుకు మాంసం తినడంపై నిషేధం అంటే..
భారతదేశం వంటి దేశాలలో ఆధ్యాత్మిక పరమైన ప్రాముఖ్యత కలిగిన కొన్ని ప్రదేశాలలో మాంసం వినియోగాన్ని నిషేధించాలని పిలుపునిస్తున్నారు. గుజరాత్‌లోని భావ నగర్ జిల్లాలోని పాలిటానా నగరంలో మాంసం అమ్మకం, మాంసాహార వినియోగం ఇప్పుడు పూర్తిగా నిషేధించబడింది. ప్రపంచంలోనే ఏకైక స్వచ్ఛమైన శాఖాహార నగరంగా పేరుగాంచిన ఈ నగరంలో మాంసం ఎందుకు నిషేధించబడిందో తెలుసా
Updated on: Apr 15, 2025 | 1:01 PM

మత విశ్వాసాలు, సాంస్కృతిక పద్ధతులు లేదా ప్రభుత్వ విధానాల కారణంగా దేశంలోని కొన్ని నగరాలు మాంసాహార ఆహారంపై ఆంక్షలు విధిస్తున్నాయి. మాంసాహార ఆహారం నిషేధించబడిన లేదా పరిమితం చేయబడిన నగరాలు ఎన్నో ఉన్నాయి. పాలిటానా లాగే, రాజ్‌కోట్, బరోడా, జునాగఢ్ , అహ్మదాబాద్ వంటి నగరాలు కూడా మాంసాహార ఆహారాన్ని నిషేధించాలని యోచిస్తున్నాయి.

ఫలితంగా జైన సమాజానికి చెందిన వ్యక్తుల మనోభావాలను, మత విశ్వాసాలను గౌరవిస్తూ.. స్థానిక ప్రభుత్వం పాలిటానా నగరంలో జంతు వధ, చేపలు, మాంసం, గుడ్ల అమ్మకాలపై నిషేధాన్ని అమలు చేసింది. ఈ నియమాన్ని ఉల్లంఘించిన వారికి జరిమానాలు కూడా విధించింది.

2014లో జైనులు ఎక్కువగా నివసించే పాలిటానాలో 200 మందికి పైగా జైన సన్యాసులు నిరసన వ్యక్తం చేశారు. నగరంలో 250 కి పైగా మాంసం దుకాణాలను మూసివేశారు. మాంసం వినియోగాన్ని నిషేధించాలని వారు నిరసనలు, నిరాహార దీక్షలు కూడా నిర్వహించారు.

దేవాలయాల నగరం అని కూడా పిలువబడే ఈ నగరంలో 800 కి పైగా జైన దేవాలయాలు ఉన్నాయి. ఇది జైన మతానికి కూడా ఒక తీర్థయాత్ర స్థలం. జైన సన్యాసుల నిరసనల ఫలితంగా.. ఇక్కడ మాంసాహార ఆహారం పూర్తిగా నిషేధించబడింది.

గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలోని పాలిటానా నగరం ప్రపంచంలోనే మొట్టమొదటి నగరంగా అవతరించింది, మాంసం, గుడ్ల అమ్మకం, వినియోగంతో సహా మాంసాహార ఆహారాన్ని పూర్తిగా నిషేధించింది. మీకు ఇక్కడ మాంసాహారం దొరకదు.





























