- Telugu News Photo Gallery Cinema photos Actress Shivani Rajasekhar latest glamorous photos goes viral
అందాలతో గత్తరలేపిన యంగ్ బ్యూటీ.. శివాని రాజశేఖర్ స్టన్నింగ్ ఫొటోస్
స్టార్ హీరో రాజశేఖర్ జీవిత కూతురు శివాని రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఈ చిన్నది వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. రాజశేఖర్, నటి జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్. 1996 జూలై 1న చెన్నైలో జన్మించిన శివాని, హైదరాబాద్‌లో పెరిగింది అలాగే ఈ అమ్మడు MBBS పూర్తి చేసింది.
Updated on: Apr 15, 2025 | 1:50 PM

స్టార్ హీరో రాజశేఖర్ జీవిత కూతురు శివాని రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ఈ చిన్నది వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

రాజశేఖర్, నటి జీవిత దంపతుల పెద్ద కుమార్తె శివాని రాజశేఖర్. 1996 జూలై 1న చెన్నైలో జన్మించిన శివాని, హైదరాబాద్‌లో పెరిగింది అలాగే ఈ అమ్మడు MBBS పూర్తి చేసింది. సినిమాల పై మక్కువతో హీరోయిన్ గా అడుగుపెట్టింది.

నటిగా శివాని రాజశేఖర్ 2018లో 2 స్టేట్స్ సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అద్భుతం (2021), శేఖర్ (2022), కోట బొమ్మాళి PS (2023), WWW వంటి సినిమాల్లో నటించింది. ఈ చిన్నది తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది.

నటిగానే కాదు నిర్మాతగా కూడా మెప్పించింది ఈ వయ్యారి. హీరో రాజశేఖర్ ఎవడైతే నాకేంటి, సత్యమేవ జయతే, కల్కి వంటి చిత్రాలను నిర్మించింది. ఆమె చెల్లెలు శివాత్మిక రాజశేఖర్ కూడా తెలుగు సినిమాలో హీరోయిన్ గా చేసింది.

శివాని సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తన ఫోటోషూట్‌లు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. వ్యక్తిగత జీవిత విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది. అయితే, ఆమె నటించిన సినిమాలు ఇప్పటివరకు అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. కానీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.





























