- Telugu News Photo Gallery Bael leaves benefits: This is why you must have Bael Patra in summer season daily
Bael Leaves Benefits: వేసవిలో బిల్వ పత్రాన్ని ఇలా తీసుకోండి.. ఊబకాయంతో సహా ఎన్ని వ్యాధులకు చెక్ పెట్టవచ్చో తెలుసా..
బిల్వ వృక్షంలో ప్రతి భాగం మానవాళికి మేలు చేసేదే. బిల్వ పత్రం లేదా మారేడు పత్రం అని శివ పూజలో ఉపయోగించే ఈ చెట్టులో అనేక ఔషధగుణాలున్నాయి. మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి. ఈ బిల్వ ఆకులు పూజకే కాదు, ఆరోగ్యానికి కూడా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా వేసవిలో ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో ఒకటి లేదా రెండు ఆకులను తీసుకుంటే మీకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. కనుక ఈ బిల్వ పాత్రలను తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..
Updated on: Apr 15, 2025 | 12:00 PM

బిల్వ పత్రాలకు ఆధ్యాత్మికంగా విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఇవి శివుడికి చాలా ప్రియమైనవి. భక్తులు శివుడిని పూజించడానికి ఈ బిల్వ పత్రాలను పయోగిస్తారు. అయితే ఈ ఆకులు కేవలం పూజ కోసం కాదు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. కనుక బిల్వ పత్రాలతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను తెస్తుంది? వేసవిలో వీటిని ఎందుకు తినాలో తెలుసుకుందాం..

వేసవిలో ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో రెండు బిల్వ ఆకులు తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఆకులను నమిలి తినవచ్చు లేదా కషాయాల రూపంలో తీసుకోవచ్చు. ఇది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.

మొహాలీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయమే వెల్లడైంది. మారేడు ఆకుల్లోని అంబెలీఫెరోన్, ఎస్క్యూలెటిన్ అనే రసాయనాలు వూబకాయాన్ని సమర్థవంతంగా తగ్గిస్తున్నట్టు గుర్తించారు.

బిల్వ ఆకులు కాల్షియం, ఫైబర్, విటమిన్లు A, C, B1, B6 వంటి పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండే ఈ ఆకు మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీన్ని రోజూ తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు వంటి చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.

బిల్వ పత్రం అతిసార, మొలలు, చక్కెర వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉన్న కాల్షియం దంతాలు, ఎముకలను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంది. బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది.

బిల్వ ఆకులు మన హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అదనంగా, ఈ ఆకులను రోజూ తినడం వల్ల బిపి తగ్గుతుంది. గుండె సంబంధిత సమస్యలు ఉండవు. అలాగే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి ఉదయం ఆకులను నమలడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. దీనిలోని యాంటీ ఫంగల్ లక్షణాలు చర్మ సమస్యలను దూరంగా ఉంచుతాయి.

బిల్వ ఆకులలో ఉండే ఎంజైమ్‌లు జీర్ణ సమస్యలను దూరం చేస్తాయి. ఈ ఆకులను నమలడం వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉదయం ఈ ఆకులను తినడం వల్ల శరీరంలోని అన్ని మలినాలు బయటకు వెళ్లి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. శరీరం నిర్విషీకరణ చెందుతుంది.





























