Viral Video: నెటిజన్ల హృదయాన్ని ఆకట్టుకుంటున్న వీడియో.. చిన్నపక్షికి స్పూన్‌తో ఆహారం పెడుతున్న చిన్నారి..
పిల్లలు దేవుడితో సమానం అని అంటారు. వాళ్ళు చిట్టి చిట్టి చేతులతో చేసే పనులు ఎంతో ముద్దుగా అనిపిస్తాయి. చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు చూడటం చాలా ఆనందంగా ఉంటుంది. వారి అమాయకత్వం, అల్లరి, అల్లరి సహజంగానే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఒక వీడియోలో ఓ చిన్నారి బాలిక చిన్న పక్షికి ఆకలి తీరుస్తుంది. ఇది నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

అమాయకత్వం విషయానికి వస్తే.. ముందుగా గుర్తుకు వచ్చేది పిల్లలు. ప్రపంచంలో జరిగేవి ఏవీ చిన్నారులకు తెలియదు. ప్రపంచంలో జరిగే విషయాల గురించి ఎలాంటి జ్ఞానం చిన్నారులకు ఉండదు. తమకు నచ్చినది చేసేస్తారు. నోటికి వచ్చింది చెప్పేస్తారు. చిన్న పిల్లలలు చేసే పనులు చూడటం ఆనందంగా ఉంటుంది. అయితే కొన్నిసార్లు కొంతమంది పిల్లలు చేసే పనులు కూడా పెద్దలను భయపెడుతాయి. ప్రస్తుతం కంప్యుటర్ యుగం నడుస్తోంది. నేటి పిల్లలు తెలివైనవారు. వయసుకి మించి ఎక్కువగా ఆలోచిస్తారు. తమకు తోచిన విధంగా పనులు చేస్తారు. ఇప్పుడు వైరల్‌గా మారిన ఒక వీడియోలో ఒక చిన్నారి బాలిక ఒక చిన్న పక్షికి ఆహారం పెడుతూ..దాని ఆకలిని తీర్చడానికి ప్రయత్నిస్తోంది. ఈ వీడియో వైరల్ కావడంతో సోషల్ మీడియా నెటిజన్లు ఆ చిన్నారి చేసిన పనిని ప్రశంసిస్తున్నారు.
మీరు ప్రపంచంలో ఏ స్టేజ్ లోనైనా ఉండవచ్చు.. అయితే మనసులో కొంచెం దయతో ఉండండి” అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను బ్యూటెంగేబీడెన్ అనే ఖాతా షేర్ చేసింది. ఈ వీడియోలో ఒక చిన్న పిల్ల అత్యంత ప్రేమతో పక్షికి ఆహారం పెడుతోంది. ఒక చిన్న అమ్మాయి చేతిలో ఒక గ్లాసు పట్టుకుని ఉంది. అందులో ద్రవ ఆహారం ఉంది. ఈ చిన్నారి ఒక చెంచాతో పక్షికి ఆహారం తినిపిస్తున్నట్లు కూడా చూడవచ్చు.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:
In a world where you can be anything, be kind.. 😊 pic.twitter.com/wfWlJjQxcY
— Buitengebieden (@buitengebieden) April 13, 2025
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో లక్షా తొంభై వేల మందికి పైగా ఈ వీడియోను చూశారు. ఈ చిన్నారిపై యూజర్లు వివిధ రకాల వ్యాఖ్యలు చేస్తూ ప్రశంసల వర్షం కురిపించారు. ఒక నెటిజన్ వీడియోలోని చిన్నారిని ప్రశంసిస్తూ చిన్నరిది ఎంత సున్నితమైన, దయగల వ్యక్తిత్వం అని అన్నారు. “నేను ఈ దృశ్యాన్ని మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నాను” అని ఒకరు కామెంట్ చేశారు. చిన్నారి చూపించే దయ నిజంగా అందంగా ఉంది” అని మరొకరు వ్యాఖ్యానించారు. “పిల్లలకు జంతువుల పట్ల దయగా, గౌరవంగా ఉండటం నేర్పించడం వల్ల వారు మంచి వ్యక్తులుగా మారడానికి సహాయపడుతుంది” అని మరొకరు అన్నారు. కొంతమంది ఆ చిన్నారి హృదయాన్ని మెచ్చుకుంటూ రకరకాల ఎమోజీలతో కామెంట్ బాక్స్ ని నింపేశారు.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..