ఇది ఆకు కాదు.. సర్వరోగాలకు చెక్‌పెట్టే బ్రహ్మాస్త్రం
Jyothi Gadda
14 April 2025
ఈ మూలిక చూర్ణం తీసుకుంటుంటే గుండె జబ్బులు, క్యాన్సర్, ఆర్థరైటిస్, స్ట్రోక్, శ్వాసకోశ వ్యాధులు తదితర సమస్యలు దరిచేరవు. బ్రహ్మి చేసే ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము.
బ్రహ్మి ఆకులు లేదా సరస్వతి ఆకులు. ఆయుర్వేదంలో ఈ మూలికకు ప్రత్యేకమైన స్థానం వుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు వుండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంపొదిస్తుంది.
బ్రహ్మి ఆకులు మానసిక ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తాయి. మెమరీ బూస్టర్ అని బ్రహ్మికి పేరు. దీన్ని తీసుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. నిద్రలేమి సమస్యకు చక్కటి పరిష్కారం అవుతుంది.
బ్రాహ్మి జ్ఞాపకశక్తిని మేరుపరచడంలో సహాయపడుతుంది. కాలేయ సంబంధిత సమస్యలను తొలగించి కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో బ్రాహ్మీ క్యాప్సూల్ చాలా మేలు చేస్తుంది.
వైద్యుల పర్యవేక్షణలో సకాలంలో బ్రాహ్మిని తీసుకోవడం వల్ల అల్జీమర్స్ వ్యాధిని నివారించవచ్చు. బ్రాహ్మి మూర్ఛ, ఆస్తమా వంటి వ్యాధులను పూర్తిగా నయం చేస్తుంది.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడంలో బ్రాహ్మి చాలా ప్రభావవంతమైన ఔషధం. చక్కర వ్యాధి నిర్మూలనో బ్రహ్మీకి బ్రేక్ లేదు.
మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి జ్ఞాపకశక్తిని పెంచడానికి, భోజనం తర్వాత రోజుకు రెండుసార్లు బ్రాహ్మిని సేవించడం మంచిది. రక్తపోటును తగ్గించే గుణం బ్రహ్మికి వుంది.
ఆయుర్వేదంలో జుట్టు సమస్యల పరిష్కారంగా కూడా బ్రహ్మిని వాడుతుంటారు. మధుమేహం చికిత్సలోనూ సహాయపడుతుంది, గాయాలు మానేందుకు కూడా ఈ ఆకులు ఉపయోగిస్తారు.