AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఎంతకు తెగించార్రా.. చెన్నై అంటే మరీ ఇంత భయమా! స్టేడియం బయట జెండాల పంచాయితీ

ఎకానా స్టేడియంలో చెన్నై అభిమానికి జెండా అనుమతించకపోవడంపై వివాదం చెలరేగింది. కర్రలు లేని జెండాను కూడా గార్డు లాక్కోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రతా నిబంధనలు ఉన్నా, అభిమానుల భావాలను గౌరవించాల్సిన అవసరం ఉందని నెటిజన్లు పేర్కొన్నారు. ఈ వివాదం మధ్యే, ధోని కోసం వచ్చిన పసుపు సేన స్టేడియాన్ని నిండ్చడంతో అతడి క్రేజ్ మళ్లీ నిరూపితమైంది.

Video: ఎంతకు తెగించార్రా.. చెన్నై అంటే మరీ ఇంత భయమా! స్టేడియం బయట జెండాల పంచాయితీ
Csk Fan Flag Controversy
Follow us
Narsimha

|

Updated on: Apr 15, 2025 | 9:04 AM

ఏప్రిల్ 14న ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ vs లక్నో సూపర్ జెయింట్స్ మధ్య ఎకానా స్టేడియంలో జరుగుతున్న పోరు ప్రారంభానికి ముందే ఓ ఆసక్తికరమైన వివాదం చర్చనీయాంశమైంది. ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఉన్న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుండగా, ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వేలాదిగా అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. లక్నో జట్టు తమ హోమ్ గ్రౌండ్‌లో ఆడుతుండగా, ‘థాలా’ ధోని ఆటను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన చెన్నై అభిమానుల సమూహం స్టేడియాన్ని పసుపు రంగుతో నింపేసింది. చెన్నై సూపర్ కింగ్స్‌కు దేశంలోని ఏ స్టేడియంలో అయినా మద్దతుదారులు ఉన్నదే ప్రత్యేకత. కానీ, ఈ మ్యాచుకు ముందు జరిగిన ఒక సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో ఒక వివాదానికి కారణమైంది.

ఈ వీడియోలో ఓ గార్డు, చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని చేతిలో ఉన్న సాధారణ జెండాను లాక్కొంటూ కనిపించాడు. కర్రలు లేని జెండా అయినప్పటికీ, స్టేడియంలోకి అనుమతించకుండా, అభిమానిపై తీరని రీతిలో వ్యవహరించడంపై అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. ఇదివరకే ముంబై వాంఖడే స్టేడియంలో కేకేఆర్ అభిమానుల జెండాలను అనుమతించకపోవడంతో అలాంటి సంఘటన ఒకసారి సంభవించింది. కానీ, అక్కడ జెండా కర్రల కారణంగా స్టేడియానికి అనుకూలంగా ఉండకపోవడమే ప్రధాన కారణం కాగా, లక్నోలో చోటుచేసుకున్న తాజా సంఘటనలో కర్రలు లేని జెండాను కూడా నిరాకరించడమే వివాదాస్పదమైంది.

ఈ ఘటనపై అభిమానుల విమర్శలు ఊపందుకుంటుండగానే, స్టేడియం వెలుపల నుండి చెన్నై జెండాలు నిలిపివేయడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే, భద్రతా పరంగా కొన్ని నియమాలు ఉండటం సహజమే అయినా, అభిమానుల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందని చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా, మ్యాచ్ విషయానికొస్తే, తొలుత బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 14వ ఓవర్ ముగిసే సమయానికి 4 వికెట్లు కోల్పోయి 105 పరుగులు చేసింది. మ్యాచ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతుండగా, ప్రతి సిక్సర్, వికెట్, టర్నింగ్ మోమెంట్‌ను అభిమానులు ఉత్కంఠగా గమనిస్తూ సోషల్ మీడియాలో లైవ్ అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ వివాదం మరుగుపోయినా, ‘ధోని మ్యాజిక్’కు ఈ దేశంలో ఎలాంటి అడ్డంకులు లేవని అభిమానుల హజరు స్పష్టంగా తెలియజేసింది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..