నిత్యామీనన్‌తో అవసరాల థ్రిల్లర్ వెబ్‌సిరీస్..!
ఎలాంటి పాత్ర అయినా సరే మెప్పించగల హీరోయిన్లలో నిత్యామీనన్ ఒకరు. కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి విభిన్న పాత్రల్లో నటిస్తూ వస్తోన్న నిత్యామీనన్
Nithya Menen Web Series: ఎలాంటి పాత్ర అయినా సరే మెప్పించగల హీరోయిన్లలో నిత్యామీనన్ ఒకరు. కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి విభిన్న పాత్రల్లో నటిస్తూ వస్తోన్న నిత్యామీనన్.. ఇటీవల బ్రీత్ 2తో వెబ్‌సిరీస్‌లోకి కూడా అడుగెట్టారు. ఇక తాజా సమాచారం ప్రకారం అన్నీ కుదిరితే నిత్యా మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.
నటుడిగానే కాకుండా ఊహలు గుసగుసలాడే, జో అచ్యుతానంద మూవీలతో దర్శకుడిగా మంచి పేరును సాధించిన అవసరాల శ్రీనివాస్.. ఓ వెబ్‌సిరీస్‌ని రాసుకున్నారట. థ్రిల్లర్ కథాంశంతో ఈ సిరీస్ ఉండగా.. అందులో నిత్యామీనన్‌ని నటింపజేయాలని అనుకుంటున్నారట. దీనికి సంబంధించి ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపినట్లు కూడా తెలుస్తోంది. దీనిపై నిత్యా పాజిటివ్‌గా స్పందించారని, కానీ ఇంకా డేట్లు ఇవ్వలేదని సమాచారం. ఇక ఈ సిరీస్‌ని ప్రముఖ వైజయంతీ మూవీస్ నిర్మించనున్నట్లు టాక్.
Read More: