బిగ్ బాస్ ఊహించని సర్‌ప్రైజ్.. హోస్టుగా సమంతా.?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో ఈ వారం ప్రత్యేకంగా ఉండనుంది. అక్కినేని నాగార్జున స్థానంలో హోస్టుగా ఈ వారం సమంతా రానుందని టాక్ నడుస్తోంది.

బిగ్ బాస్ ఊహించని సర్‌ప్రైజ్.. హోస్టుగా సమంతా.?
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 23, 2020 | 4:49 PM

Bigg Boss Telugu 4: తెలుగు బిగ్ బాస్ సీజన్ 4లో ఈ వారం ప్రత్యేకంగా ఉండనుంది. హోస్టు అక్కినేని నాగార్జున ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ కోసం మనాలీకి వెళ్లడంతో.. ఆయన స్థానంలో ఈ వారం హోస్టుగా అక్కినేని కోడలు, హీరోయిన్ సమంతా రానుందని టాక్ నడుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరోవైపు బిగ్ బాస్ సీజన్ 3కి అక్కినేని నాగార్జున అందుబాటులోకి లేకపోవడంతో కొన్ని ఎపిసోడ్స్‌కు శివగామి రమ్యకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ముందుగా ఈ సీజన్‌కు మొదట రమ్యకృష్ణను హోస్టుగా తీసుకోవాలని నిర్వాహకులు అనుకున్నారట. అయితే ఆమె అప్పటికే ‘నాగబైరవి’ సీరియల్‌కు డేట్స్ ఇవ్వడంతో.. ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించింది. కాగా, లాక్‌డౌన్‌ ముందు ఓ చాట్ షో కోసం సమంతాను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే అది అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. మరి ఇప్పుడు బిగ్ బాస్‌లో ఆ మేజిక్ రీక్రియేట్ అవుతుందా.? లేదా.? అనేది చూడాలి.