AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shopping Mall : ఏంటీ మేడమ్.. ఇది మీరేనా.. షాపింగ్ మాల్ సినిమాలో నవ్వించిన ఈ అమ్మాయి గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు..

సాధారణంగా కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ పోషించిన నటీనటులు ఎక్కువగా ఫేమస్ అవుతుంటారు. చేసింది ఒకటి రెండు సినిమాలే అయినప్పటికీ తమ యాక్టింగ్, కామెడీ టైమింగ్ తో అలరిస్తుంటారు. చిన్న పాత్రలు పోషించినప్పటికీ ప్రేక్షకులకు దగ్గరవుతుంటారు. అలాంటి వారిలో ఈ నటి ఒకరు. షాపింగ్ మాల్ సినిమాలో అంజలి స్నేహితురాలిగా వెండితెరపై సందడి చేసింది.

Shopping Mall : ఏంటీ మేడమ్.. ఇది మీరేనా.. షాపింగ్ మాల్ సినిమాలో నవ్వించిన ఈ అమ్మాయి గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే అస్సలు గుర్తుపట్టలేరు..
Suguna Nagarajan
Rajitha Chanti
|

Updated on: Jun 12, 2026 | 9:45 AM

Share

ఎలాంటి అంచనాలు లేకుండా అడియన్స్ ముందుకు వచ్చి సంచలన విజయం సాధించిన సినిమాలు చాలా ఉన్నాయి. అలాగే పలు చిత్రాలు ఎవర్ గ్రీన్స్ హిట్స్. అలాంటి వాటిలో షాపింగ్ మాల్ సినిమా ఒకటి. తమిళనాట సంచలన విజయం సాధించిన ‘అంగడి తెరు’ చిత్రం. దీనిని తెలుగులో ‘షాపింగ్ మాల్’ పేరుతో రిలీజ్ చేశారు. వసంతబాలన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతోమంది నటీనటులకు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ చిత్రంలో మహేష్, అంజలి, వెంకటేష్, పాండి కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి విజయ్ ఆంటోనీ , జి.వి. ప్రకాష్ సంగీతం అందించారు. చెన్నైలోని టి-నగర్‌లో బట్టల దుకాణాలలో పనిచేసే ఉద్యోగుల సమస్యల గురించి తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్ అంజలి పక్కన ఒక ముఖ్యమైన పాత్రలో నటించి మెప్పించింది నటి సోఫియా (సుగుణ నాగరాజన్). ఆ సినిమాలో తన నటనతో, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె.. ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఏం చేస్తోంది? అనే విషయాలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి.

ఎక్కువమంది చదివినవి : Sridevi Vijaykumar : ఇప్పుడున్న హీరోలలో అతడంటే పిచ్చి ఇష్టం.. అతడే నా ఫేవరేట్.. హీరోయిన్ శ్రీదేవి విజయ్ కుమార్..

ఆ సినిమా తర్వాత ఆమెకు సినిమా ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాలేదు. కొన్ని వ్యక్తిగత కారణాలు, వైవాహిక జీవితంలోని ఒడిదొడుకుల వల్ల ఆమె చిత్ర పరిశ్రమకు క్రమంగా దూరమైంది. ఈ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాగరాజన్‌ను నటి సుకున వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఒక బ్యూటీ పార్లర్ నడుపుతున్నారు. అలాగే తన భర్తకు సినిమాల్లో నటించడం ఇష్టం లేదని.. అందుకే తాను సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తన మొదటి బిడ్డను కోల్పోయినప్పుడు భర్తతో వచ్చిన మనస్పర్థలు, కుటుంబంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి ఆవేదన వ్యక్తం చేసింది. సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలగాలని ఆశపడినప్పటికీ, పరిస్థితులు అనుకూలించకపోవడంతో నటనను వదిలేయాల్సి వచ్చింది. ప్రస్తుతం సినిమాలకు పూర్తిగా దూరమైన తర్వాత సుగుణ తన కాళ్ల మీద తాను నిలబడాలని నిశ్చయించుకుంది.

ఎక్కువమంది చదివినవి : Mahesh Babu: మహేష్ ఇమేజ్‏కు ఆ సినిమా కరెక్ట్ కాదు.. నేను వినుంటే వద్దనేవాడిని.. సూపర్ స్టార్ కృష్ణ..

ఆమె నటనను పక్కన పెట్టి ఒక సొంత వ్యాపార రంగంలో (Business) స్థిరపడింది. బిజినెస్ ఉమెన్‌గా మారి తన సొంత శ్రమతో ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంది.”సినిమాలు నన్ను గుర్తింపు తెచ్చినప్పటికీ, జీవితంలో స్థిరపడటానికి వ్యాపారమే నాకు అండగా నిలిచింది” అని ఆమె పేర్కొంది.ప్రస్తుతం ఆమె తన పాత చేదు జ్ఞాపకాలను మర్చిపోయి, ఒక స్వతంత్ర మహిళగా విజయవంతంగా జీవితాన్ని గడుపుతోంది. అంగడి తెరు సోఫియాగా గుర్తింపు తెచ్చుకున్న సుగుణ, స్క్రీన్ మీద కనిపించకపోయినా.. నిజ జీవితంలో ఒక పోరాట యోధురాలిగా నిలిచి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

ఎక్కువమంది చదివినవి : Trending Song : ఏం పాట మావ.. 22 సంవత్సరాలుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అమ్మాయిలు పిచ్చెక్కిపోయారు

షాపింగ్ మాల్ మూవీ నటి..

Suguna Nagarajan Fam

Suguna Nagarajan Fam

ఎక్కువమంది చదివినవి : Jai Chiranjeeva: చిరంజీవి మేనకోడలు ఇంత మారిపోయింది మావా.. ? గ్లామరస్ లుక్కులో అదిరిపోయిన జై చిరంజీవి చైల్డ్ ఆర్టిస్ట్..

Follow Us