AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏ ప్రాజెక్ట్ అయినా పవన్‌ సినిమా తరువాతే..!

పవన్ కల్యాణ్‌తో హరీష్ శంకర్‌ సినిమాను ప్రకటించినప్పటి నుంచి పవర్‌స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. దీనికి కారణం ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇది వరకు

ఏ ప్రాజెక్ట్ అయినా పవన్‌ సినిమా తరువాతే..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 18, 2020 | 7:17 PM

Share

పవన్ కల్యాణ్‌తో హరీష్ శంకర్‌ సినిమాను ప్రకటించినప్పటి నుంచి పవర్‌స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. దీనికి కారణం ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇది వరకు వచ్చిన గబ్బర్‌సింగ్ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేయడమే. దీంతో ఇప్పుడు తెరకెక్కబోయే సినిమా అంతకు మించి ఉండాలంటూ ఫ్యాన్స్ హరీష్‌కు రిక్వెస్ట్ చేస్తున్నారు. వారందరి రిక్వెస్ట్‌లకు స్పందిస్తోన్న దర్శకుడు.. అంతకుమించి ఈ చిత్రం ఉంటుందంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదిలా ఉంటే హరీష్‌తో మరో సినిమాను చేయబోతున్నట్లు గద్దలకొండ నిర్మాతలు తాజాగా ప్రకటించారు. దీంతో పవన్ కంటే ముందు మరో హీరోతో హరీష్ పనిచేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

ఈ క్రమంలో నిర్మాత ఎస్కేఎన్‌.. అన్నా ఎన్ని సినిమాలు అయినా చెయ్. కానీ నెక్ట్స్‌ ది మాత్రం మన పవన్‌తోనే ఉండాలి. అది కూడా చరిత్రను సృష్టించాలి అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇక దానికి సమాధానమిచ్చిన హరీష్‌ శంకర్‌.. తమ్ముడు పవర్‌స్టార్ సినిమా స్క్రిప్ట్ పని, మ్యూజిక్‌ పని రెండు జరుగుతున్నాయి. నేను చేసే ఏ ప్రాజెక్ట్ అయినా పవన్ మూవీ తరువాతే ఉంటుంది. నేను కూడా మీలాంటి ఫ్యాన్స్‌ని మర్చిపోకు అని అన్నారు. దీంతో పవన్- హరీష్‌ సినిమాపై మరోసారి క్లారిటీ వచ్చినట్లైంది. కాగా ఈ చిత్రం వచ్చే ఏడాది నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Follow Us