AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలీవుడ్ బ‌డా నిర్మాత ఏక్తాకపూర్‌పై హైదరాబాద్‌లో కేసు..

బాలీవుడ్ బ‌డా నిర్మాత, బాలాజీ టెలీఫిలింస్ క్రియేటివ్ హెడ్‌ క‌మ్ జాయింట్ డైరెక్టర్‌ ఏక్తా కపూర్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ అందింది. విశాల్ కుమార్ అనే వ్యక్తి ఈ కంప్లైంట్ ఇచ్చారు. భార‌త‌ ఆర్మీ డ్రెస్, సింబ‌ల్ ను అభ్యంతరకర రీతిలో చూపించార‌ని ఆరోపిస్తూ బాలాజీ టెలీఫిల్మ్స్ ఓన‌ర్ ఏక్తా కపూర్‌పై సైబర్‌ క్రైం విభాగానికి చేసిన ఫిర్యాదులో విశాల్ పేర్కొన్నారు. ఏక్తా కపూర్ నిర్మించిన‌ ‘అన్‌ సెన్సార్డ్‌ సీజన్‌-2’ వెబ్‌ సీరీస్ […]

బాలీవుడ్ బ‌డా నిర్మాత ఏక్తాకపూర్‌పై హైదరాబాద్‌లో కేసు..
Ram Naramaneni
|

Updated on: May 19, 2020 | 6:34 AM

Share

బాలీవుడ్ బ‌డా నిర్మాత, బాలాజీ టెలీఫిలింస్ క్రియేటివ్ హెడ్‌ క‌మ్ జాయింట్ డైరెక్టర్‌ ఏక్తా కపూర్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ అందింది. విశాల్ కుమార్ అనే వ్యక్తి ఈ కంప్లైంట్ ఇచ్చారు. భార‌త‌ ఆర్మీ డ్రెస్, సింబ‌ల్ ను అభ్యంతరకర రీతిలో చూపించార‌ని ఆరోపిస్తూ బాలాజీ టెలీఫిల్మ్స్ ఓన‌ర్ ఏక్తా కపూర్‌పై సైబర్‌ క్రైం విభాగానికి చేసిన ఫిర్యాదులో విశాల్ పేర్కొన్నారు.

ఏక్తా కపూర్ నిర్మించిన‌ ‘అన్‌ సెన్సార్డ్‌ సీజన్‌-2’ వెబ్‌ సీరీస్ త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. ఈ సీరీస్‌లోని ‘ప్యార్‌ ఔర్‌ ప్లాస్టిక్‌’ ఎపిసోడ్‌లో ఒక వ్యక్తికి ఆర్మీ డ్రెస్ వేసి అసభ్యకరంగా మాట్లాడే సన్నివేశాలున్నాయి. ఇటీవ‌లే దీనికి సంబంధించిన ట్రైలర్ ను ఫేస్ బుక్ పేజ్ లో రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ చూసిన‌ విశాల్ కుమార్… ఓ ఆర్మీ ఆఫీస‌ర్ భార్యకు, మ‌రో వ్యక్తికి ఉన్న సంబంధాలను ఇందులో చూపించారని ఆరోపించారు. నిర్మాత‌ ఏక్తా కపూర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో కంప్లైంట్ ను సైబర్ క్రైమ్ పోలీసులు స్వీకరించారు. పూర్తి వివరాలను పరిశీలించిన తర్వాత ఏక్తా కపూర్ కు నోటీసులు పంపుతామని వెల్ల‌డించారు.

Follow Us
ఎయిర్‌పోర్ట్‌లో హార్దిక్, మహిక సందడి...నలుగురిలో ఏంటి భయ్యా ఇది
ఎయిర్‌పోర్ట్‌లో హార్దిక్, మహిక సందడి...నలుగురిలో ఏంటి భయ్యా ఇది
ఖరీదైన హెయిర్ డైలు వద్దు.. ఇలా సింపుల్‌గా తెల్ల జుట్టుకు చెక్‌
ఖరీదైన హెయిర్ డైలు వద్దు.. ఇలా సింపుల్‌గా తెల్ల జుట్టుకు చెక్‌
ఇతడి ట్రిక్ తెలిస్తే సెకన్లలో పూరీలు రెడీ.. వైరల్ వీడియో..
ఇతడి ట్రిక్ తెలిస్తే సెకన్లలో పూరీలు రెడీ.. వైరల్ వీడియో..
ఈ చిన్న పని చేయకపోతే పీఎం కిసాన్ కట్.. కేంద్రం కొత్త రూల్
ఈ చిన్న పని చేయకపోతే పీఎం కిసాన్ కట్.. కేంద్రం కొత్త రూల్
డైరెక్టర్‌గా మరో జబర్దస్త్ కమెడియన్! ఇక టీవీ షోకు గుడ్‌ బై!
డైరెక్టర్‌గా మరో జబర్దస్త్ కమెడియన్! ఇక టీవీ షోకు గుడ్‌ బై!
టీమిండియా మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా సెమీస్ చేరదు..
టీమిండియా మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిచినా సెమీస్ చేరదు..
14 ఏళ్లకే ఇండస్ట్రీలో చక్రం తిప్పింది.. 36 ఏళ్లకే మరణం..
14 ఏళ్లకే ఇండస్ట్రీలో చక్రం తిప్పింది.. 36 ఏళ్లకే మరణం..
రెండు శుభ యోగాలు..ఆ రాశుల వారికి అదృష్టాలు..!
రెండు శుభ యోగాలు..ఆ రాశుల వారికి అదృష్టాలు..!
రైల్వేశాఖ అదిరిపోయే శుభవార్త.. ఇంటి నుంచే పార్శిల్ పంపించవచ్చు
రైల్వేశాఖ అదిరిపోయే శుభవార్త.. ఇంటి నుంచే పార్శిల్ పంపించవచ్చు
టీమిండియాకు కలిసొస్తున్న 19 ఏళ్ల నాటి సెంటిమెంట్
టీమిండియాకు కలిసొస్తున్న 19 ఏళ్ల నాటి సెంటిమెంట్