Dil Raju- Harish Shankar: దొంగతనం పక్కా అంటోన్న దిల్ రాజు, హరీశ్ శంకర్.. క్రైం వెబ్ సిరీస్ కు శ్రీకారం..
ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్(Web Series) లకూ ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత వీటిని వీక్షించే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ (Tollywood) లోనూ వీటికి బాగా క్రేజ్ పెరిగింది
ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్(Web Series) లకూ ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత వీటిని వీక్షించే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ (Tollywood) లోనూ వీటికి బాగా క్రేజ్ పెరిగింది. పెద్ద పెద్ద దర్శక, నిర్మాతలు సైతం వెబ్ సిరీస్ ల నిర్మాణంపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈక్రమంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju), డైరెక్టర్ హరీశ్ శంకర్ (Harish Shankar) కూడా ఈ జాబితాలో చేరారు. గతంలో ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘దువ్వాడ జగన్నాథం’ లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించిన వీరిద్దరూ మొదటిసారి ఓ క్రైమ్ సిరీస్ వెబ్ సిరీస్ కోసం చేతులు కలిపారు. ఈ వెబ్ సిరీస్ పేరు ‘ఏటీఎమ్’.
ఏటీఎం దోపిడీ ఆధారంగా..
కాగా ఈ సిరీస్ కు కథను అందించడంతో పాటు సహ నిర్మాతగా వ్యవహరించనున్నారు హరీశ్ శంకర్. త్వరలోనే వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభం కానుందంటూ తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. ‘రాబరీ బిగిన్స్ సూన్’ (దోపిడీ త్వరలో మొదలు అవుతుంది) అని ఒక పోస్టర్ ను విడుదల చేశారు. దీనికి ‘దొంగతనం పక్కా’ అని క్యాచీ క్యాప్షన్ కూడా ఇచ్చారు. కాగా హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ ఏటిఎం దోపీడీ ఆధారంగా హరీష్ శంకర్ ఈ క్రైమ్ స్టోరీ రాసినట్టు తెలుస్తోంది. ఈ సిరీస్ కు చంద్ర మోహన్ స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వ బాధ్యతలు వహించనున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షితా రెడ్డి, హరీష్ శంకర్ ఈ సిరీస్ ను నిర్మిస్తున్నారు. కాగా ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. దీనిపై ఇప్పటికే ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు.
Dil Raju Productions @DilRajuProdctns and @harish2you join hands with @ZEE5Telugu for a thrilling heist in the city of Hyderabad. #ATM Web Series Shoot Begins Soon !!
దొంగతనం పక్కా!? pic.twitter.com/cvnzXWy00m
— BA Raju’s Team (@baraju_SuperHit) January 27, 2022
Hyderabad: నేడు నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగే ప్రాంతాలివే..
US- Canada border: ‘డాలర్ డ్రీమ్స్’ లో ఆ గ్రామ ప్రజలు.. అదే ప్రాణాల మీదకు తెస్తోంది..