AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌‌కు డూప్‌గా చేసేది మన తెలుగమ్మాయే? ఎవరో తెలుసా

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ‘దేవర’ సినిమాతో టాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం మెగా పవర్​స్టార్​ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది జాన్వీ. తన గ్లామర్, యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకోవచ్చని ..

Janhvi Kapoor: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్‌‌కు డూప్‌గా చేసేది మన తెలుగమ్మాయే? ఎవరో తెలుసా
Image (16)
Nikhil
|

Updated on: Nov 25, 2025 | 10:42 PM

Share

బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ‘దేవర’ సినిమాతో టాలీవుడ్​ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే! ప్రస్తుతం మెగా పవర్​స్టార్​ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది జాన్వీ. తన గ్లామర్, యాక్టింగ్‌తో అందరినీ ఆకట్టుకోవచ్చని ఈ సినిమా గ్లింప్స్​ చూస్తే అర్థమవుతుంది. అయితే, షూటింగ్ సమయంలో జాన్వీకి బాడీ డబుల్‌గా పని చేసినది మన తెలుగమ్మాయే! ఆమె ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే! ఆమె కేవలం డబుల్ మాత్రమే కాదు.. ఓ ముఖ్యపాత్రలో కూడా కనిపించనుందట!

రామ్ చరణ్, జాన్వీ కపూర్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా. ఈ సినిమాలో జాన్వీ పాత్ర పేరు అచ్చియమ్మ అని ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్ తో రివీల్ చేశారు. అలాగే ఫస్ట్ లిరికల్ సాంగ్ గా రిలీజ్ చేసిన ‘చికిరి చికిరి’ అనే పాటలో కూడా జాన్వీ కపూర్ కనిపించింది. ఈ పాటలో రామ్ చరణ్ స్టెప్పులతో పాటు జాన్వీ గ్లామర్ కూడా చర్చనీయాంశం అయ్యింది. దర్శకుడు బుచ్చిబాబు సనా జాన్వీ పాత్రని చాలా వైవిధ్యంగా డిజైన్ చేశాడని టాక్. ఆమె గ్లామర్ గా కనిపిస్తున్నప్పటికీ.. పెర్ఫార్మన్స్ కూడా అదే రేంజ్లో ఉండబోతుంది అని వినికిడి. ఈ సినిమాతో జాన్వీ తెలుగు ప్రేక్షకులకి మరింత కొత్తగా కనిపిస్తుందట.

Janhvi N Bhadru

Janhvi N Bhadru

అయితే పెద్ది సినిమాలో జాన్వీకి బాడీ డబుల్​గా తెలుగమ్మాయి బాంధవి శ్రీధర్ కనిపించనుందట. అవును.. జాన్వీ కపూర్ హైట్ 5 అడుగుల 4 అంగుళాలట. బాంధవి కూడా అంతే హైట్ ఉంటుందట. వీళ్ళ లుక్స్ కూడా చూడటానికి చాలా వరకు సిమిలర్ గా ఉంటాయి. ‘పెద్ది’ లో చాలా ప్లేసుల్లో జాన్వీ బ్యాక్ షార్ట్స్ లో బాంధవి కనిపిస్తుందన్న మాట. జాన్వీ ఫ్లైట్ ఖర్చులు, హోటల్ రూమ్ ఖర్చులు, ఆమె టీం ఖర్చులు వంటివి సేవ్ చేసుకునేందుకు నిర్మాతలు బాంధవిని ఎంపిక చేసుకున్నట్టు అర్ధం చేసుకోవచ్చు. అన్నట్టు ఈమె కూడా సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించినట్టు చెబుతున్నారు. దీనిపై క్లారిటీ రావాలంటే సినిమా రిలీజ్​ అయ్యేవరకు ఆగాల్సిందే!

Follow Us