‘ఆ స్క్రిప్ట్ విని మహేష్‌తో సినిమా చేయకపోవడం మంచిదనుకున్నా.. కానీ వేరే హీరోతో బ్లాక్‌బస్టర్ అయింది’
నిర్మాత అనిల్ సుంకర మహేష్ బాబుతో తనకున్న రిలేషన్‌ను పంచుకున్నారు. దూకుడు నిర్మాతగా గుర్తింపు పొందడం తన జీవితంలో గొప్ప గౌరవం అని తెలిపారు. ఆగడు చిత్రంపై భారీ అంచనాలు, విడుదల తేదీ సమస్యలు లాంటివి.. ఆ సినిమా ఫలితంపై తీవ్ర ప్రభావాన్ని చూపాయన్నారు.

టాలీవుడ్ నిర్మాత అనిల్ సుంకర ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకున్నారు. సూపర్‌స్టార్ మహేష్ బాబుతో తన సినీ ప్రయాణం, కెరీర్లో కీలక చిత్రాలైన దూకుడు, ఆగడులపై తన అనుభవాలను తెలిపారు. దూకుడు తన జీవితంలో ఒక గొప్ప మలుపు అని.. అది సాధించిన విజయం తనకు దూకుడు నిర్మాత అనే గుర్తింపును ఇచ్చిందని.. అది తన జీవితంలో అతిపెద్ద కాంప్లిమెంట్ అని అన్నారు. ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు మహేష్ బాబుతో ఒక సినిమా చేయాలనే తన లక్ష్యం దూకుడుతో నెరవేరిందని, అది తన రెండో సినిమా కావడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
ఇది చదవండి: ఆ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర ఛాన్స్‌లు కోసం నేను, చిరంజీవి వెయిట్ చేశాం.. ఓపెన్‌గా చెప్పిన టాలీవుడ్ హీరో
అలాగే ఓ ఆసక్తికర సంఘటనను కూడా వివరించారు. మహేష్ బాబుతో సినిమా చేయకముందు.. పద్మాలయా సంస్థ ద్వారా మహేష్ కోసం వచ్చిన ఒక స్క్రిప్ట్‌ను సహ-నిర్మాతగా చేయమని అడిగారని తెలిపారు. అయితే, ఆ స్క్రిప్ట్ చదవకుండానే పెట్టుబడి పెట్టడం వేస్ట్ అనిపించింది. మహేష్ బాబు లాంటి పెద్ద హీరో సినిమాను కథ వినకుండా చేయలేనని, కనీసం సినాప్సిస్ అయినా కావాలని కోరాను. సినాప్సిస్ చూసిన తర్వాత, ఆ కథ మహేష్ బాబు ఇమేజ్‌కు సరిపోదని భావించి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాను. అది వదులుకుంటే మహేష్‌తో ఇంకో సినిమా చేయలేరని ఇతరులు చెప్పినా, మంచి హిట్ సినిమా చేయడమే ముఖ్యమని భావించాను. ఆ స్క్రిప్ట్‌తో మహేష్‌తో సినిమా తీయడం కన్నా, సినిమా చేయకపోవడమే మంచిదని నిర్ణయించుకున్నాను. ఆ స్క్రిప్ట్ వేరే హీరోతో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని.. ఆ హీరోకు అది సరిపోయిందని, కానీ మహేష్‌ను ఆ స్పేస్‌లో తాను ఊహించుకోలేకపోయానని అనిల్ సుంకర పేర్కొన్నారు. డెస్టినీ వల్ల మహేష్‌తో నాలుగు సినిమాలు చేయగలిగానని ఆయన అన్నారు.
మహేష్ బాబుతో తన రిలేషన్ కేవలం హీరో-నిర్మాత సంబంధం కాదని, అది అంతకు మించి అని అనిల్ సుంకర వివరించారు. తాను కృష్ణ అభిమానినని, మహేష్‌తో తాను, దర్శకుడు శ్రీను వైట్ల ఒకే వయసు వాళ్లం కావడం వల్ల సహజంగానే రిలేషన్ ఏర్పడిందని చెప్పూర్. మహేష్‌ను ఒక నటుడిగా, వ్యక్తిగా తాను ఎంతో అభిమానిస్తానని తెలిపారు. మహేష్‌తో ఉన్న సమయం చాలా విలువైనదని, ఆయనతో మాట్లాడినప్పుడు ఇతర విషయాలన్నీ మర్చిపోతారని, ఆయన సెటైర్లు, సెట్ వాతావరణం చాలా ఉత్సాహంగా ఉంటుందని గుర్తుచేసుకున్నారు.
దూకుడు విడుదల సమయంలో తనకు ఒక్కడికే కొద్దిగా డిస్కనెక్ట్ అయినట్టు అనిపించిందని.. ఎందుకంటే హీరోకు సమస్య ఉందనే ప్లాట్ పాయింట్ తనను థియేటర్లో కూడా ఇంటర్వెల్ అయ్యేదాకా కనెక్ట్ అవ్వనివ్వలేదని అనిల్ సుంకర తెలిపారు. అయితే, మిగతా అందరూ సినిమాపై నమ్మకం ఉంచారన్నారు. ఆగడు చిత్రం ఫలితంపై కూడా కీలక విషయాలు పంచుకున్నారు. దూకుడు తర్వాత ఆగడుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయని, మొదటి మూడు రోజులు వసూళ్లు అద్భుతంగా ఉన్నా, ఆ తర్వాత మొత్తం మారిపోయిందని చెప్పారు. దూకుడు తర్వాత అదే టెంప్లేట్‌ను మార్చి తీశారని ప్రేక్షకులు భావించారన్నారు. పండగకు రెండు వారాల ముందు సినిమాను విడుదల చేయాలని భావించినప్పటికీ, అనుకోని మార్పుల వల్ల తొందరగా విడుదల చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అదే సమయంలో రామ్ చరణ్ సినిమా కూడా ఉండడం వల్ల పరిస్థితులు ప్రతికూలంగా మారాయని అనిల్ సుంకర స్పష్టం చేశారు.
ఇది చదవండి: ఆరుగురు పతివ్రతలు చేశాక సినిమాలు ఆపేయడానికి కారణం ఇదే.. నిజాన్ని చెప్పిన సీరియల్ నటుడు
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




