ఎన్టీఆర్ జిల్లా, గంపలగూడెం మండలం, గోసవీడులో జరిగిన భారీ దొంగతనం కలకలం రేపింది. వజినేపల్లి వెంకటేశ్వరరావు ఇంట్లో 136 గ్రాముల బంగారం, 3 కిలోల వెండి, రూ. 2.30 లక్షల నగదు చోరీకి గురయ్యాయి. దొంగలు కేవలం సొత్తును తీసుకెళ్లడమే కాకుండా, బీరువాలోని ముఖ్యమైన పత్రాలను మంచంపై పెట్టి కాల్చి బూడిద చేశారు. ఇది దొంగతనమా లేక పగతో కూడిన చర్యనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.