AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు మాత్రమే ఎలా అర్థమవుతుంది.. అసలు రహస్యం ఏంటంటే..?

డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్‌ ఏ భాషో.. ఏ అక్షరమో అర్థం కాక మనం తల పట్టుకుంటాం. కానీ అదే కాగితాన్ని మెడికల్ షాపులో ఇవ్వగానే.. వారు క్షణాల్లో చదివి కరెక్ట్ మందులు తీసి ఇస్తారు. మనకు కోడి గీతల్లా అనిపించే ఆ రాతలు, ఫార్మసిస్ట్‌లకు మాత్రం ఎలా అర్థమవుతాయి? వైద్యులు కావాలనే అలా రాస్తారా లేక దాని వెనుక ఏదైనా సీక్రెట్ కోడ్ ఉందా?

డాక్టర్ల గజిబిజి రాత మెడికల్ షాపు వాళ్లకు మాత్రమే ఎలా అర్థమవుతుంది.. అసలు రహస్యం ఏంటంటే..?
How Pharmacists Read Prescriptions
Krishna S
|

Updated on: Jan 18, 2026 | 1:28 PM

Share

మనం అనారోగ్యంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన రాసిచ్చే ప్రిస్క్రిప్షన్ చూసి చాలాసార్లు తల గీక్కుంటాం. ఆ గజిబిజి రాతలో మందు పేరు ఏంటో, అది ఎలా వాడాలో సామాన్యులకు అస్సలు అర్థం కాదు. కానీ అదే కాగితాన్ని మెడికల్ షాపులో ఇస్తే.. వారు క్షణాల్లో చదివేసి కరెక్ట్ మందులు తీసి ఇస్తారు. అసలు ఇది ఎలా సాధ్యం? ఆ గజిబిజి రాతల వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

వైద్యులు కాకపోయినా మెడికల్ షాపు సిబ్బందికి ఆ రాతలు అర్థం కావడానికి ప్రధానంగా అనుభవం కారణం. ఒక ప్రాంతంలోని మెడికల్ షాపు సిబ్బందికి అక్కడి డాక్టర్లు రెగ్యులర్‌గా ఎలాంటి మందులు రాస్తారో అవగాహన ఉంటుంది. ప్రతి డాక్టర్‌కు ఒక ప్రత్యేకమైన హ్యాండ్‌రైటింగ్ ప్యాటర్న్ ఉంటుంది దానిని ఫార్మసిస్ట్‌లు సులభంగా గుర్తుపడతారు. మందు పేరులో మొదటి రెండు అక్షరాలు, చివరి అక్షరం చూసి, అది ఏ వ్యాధికి సంబంధించిన మందో వారు ఇట్టే కనిపెట్టేస్తారు. ఒకవేళ రాత అస్సలు అర్థం కాకపోతే.. “ఈ మందు ఎవరికి? సమస్య ఏంటి?” అని కస్టమర్‌ని అడుగుతారు. ఆ సమాచారం ఆధారంగా ప్రిస్క్రిప్షన్‌లోని మందును నిర్ధారించుకుంటారు.

డాక్టర్లు ఎందుకు అలా రాస్తారు?

డాక్టర్ల రాత గజిబిజిగా ఉండటానికి కొన్ని ఆసక్తికరమైన కారణాలు ఉన్నాయి. వందలాది మంది రోగులను చూడటం వల్ల వేగంగా రాయాల్సి రావడం. రోజంతా ఒకే రకమైన మందుల పేర్లు రాస్తూ ఉండటం వల్ల రాతలో స్పష్టత తగ్గుతుంది. కొన్నిసార్లు సమీపంలోని మెడికల్ షాపులతో ఉండే కమిషన్ ఒప్పందాల వల్ల కేవలం వారికి మాత్రమే అర్థమయ్యేలా కోడ్ భాషలో రాస్తారనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

కొత్త నిబంధనలు ఏం చెబుతున్నాయి?

  • రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడకూడదనే ఉద్దేశంతో నేషనల్ మెడికల్ కమిషన్ డిసెంబర్ 2025లో కీలక సూచనలు జారీ చేసింది.
  • వైద్యులు మందుల పేర్లను వీలైనంత వరకు క్యాపిటల్ లెటర్స్‌లో, స్పష్టంగా రాయాలి.
  • మెడికల్ విద్యార్థులకు ప్రిస్క్రిప్షన్ స్పష్టంగా రాయడం అనేది పాఠ్యాంశాల్లో భాగంగా నేర్పించాలి.

రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతి రోగికి ఆరోగ్య హక్కు ఉంది. మందుల గురించి తెలుసుకునే హక్కు కూడా అందులో భాగమే. ఒక చిన్న తప్పు రాత ప్రాణాలను ప్రమాదంలో పడేస్తుంది. అందుకే డాక్టర్లు ఇచ్చే ప్రిస్క్రిప్షన్ అందరికీ అర్థమయ్యేలా ఉండటం అత్యవసరం.

Follow Us
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
సూపర్‌మ్యాన్ తరహాలో అదిరిపోయే క్యాచ్ పట్టిన సర్ఫరాజ్ ఖాన్
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఎండల్లో మిమ్మల్ని చల్లచల్లగా ఉంచే టాప్‌ 5 కూలింగ్‌ మోడల్స్‌!
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
ఏప్రిల్ 11 సెంటిమెంట్.. సంజూ రెండు సెంచరీల వెనుక వింత యాధృచ్ఛికం
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
పెరిగిన బంగారం ధరలు.. ఆదివారం పైపైకి.. లేటెస్ట్ రేట్లు ఇలా..
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించాలనుకుంటున్నారా?
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..
ఉదయాన్నే వేడినీళ్లు తాగితే పొట్ట తగ్గుతుందా..? అసలు నిజాన్ని..
డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..
డెకాయిట్ చిత్రంలో స్టార్ హీరో మేనకోడలు.. ఎవరంటే..
రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు
రాబోయే 10 రోజులు జాగ్రత్త.. దంచికొట్టనున్న ఎండలు
మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..
మళ్లీ యుద్ధం స్టార్ట్..! ఇరాన్‌తో అమెరికా చర్చలు విఫలం..
చెన్నై బోణీ మ్యాచ్‌లో వింత సంఘటన.. ఢిల్లీ ఓటమికి అంపైరే కారణమా?
చెన్నై బోణీ మ్యాచ్‌లో వింత సంఘటన.. ఢిల్లీ ఓటమికి అంపైరే కారణమా?