ఈపీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. త్వరలో యూపీఐ ద్వారా విత్‌డ్రా
ఈపీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే న్యూస్ ఇది. ఈపీఎఫ్ ఖాతా నుంచి నగదు విత్‌డ్రాను మరింత సులభతరం చేసేందుకు రంగం సిద్ధమవుతోది. నేరుగా యూపీఐ ద్వారా పీఎఫ్‌ను విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అందుబాటులోకి రానుంది. యూపీఐ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలోకి పీఎఫ్ మొత్తాన్ని బదిలీ చేసుకునే విధానం అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పీఎఫ్ విత్‌డ్రాకు క్లెయిమ్ ఫారాలు సమర్పించి రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్త విధానంలో క్షణాల్లో నగదును విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది.
పీఎఫ్ మొత్తంలో కొంత భాగాన్ని మినహాయించి.. మిగిలిన నగదును విత్‌డ్రాకు అందుబాటులో ఉంచుతారు. ఈపీఎఫ్ ఖాతాకు సీడ్ అయిన బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎంత నగదు ఉపసంహరించుకోవచ్చో చూసుకోవచ్చు. యూపీఐ పిన్ ఎంటర్ చేసి ఆ నగదును బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేసే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఒకసారి బ్యాంకు ఖాతాలోకి వచ్చాక యూపీఐ ద్వారా నగదును తమ అవసరాలకు వినియోగించుకోవచ్చు. లేదంటే డెబిట్‌కార్డును ఉపయోగించి ఏటీఎం ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ విధానం సజావుగా అమలు చేయడానికి గానూ సాఫ్ట్‌వేర్ సమస్యలను తొలగించడంపై ఈపీఎఫ్‌ఓ దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
మరిన్ని వీడియోల కోసం :
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంటే..
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
వైరల్ వీడియోలు
ఈ కోతుల దూకుడును ఆపేదెలా?
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!

