నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
అతి ఎప్పుడూ అనర్ధానికి దారితీస్తుందని పెద్దలు ఎప్పుడో చెప్పారు. విషయం ఏదైనా అతి ఎప్పుడూ పనిచేయదు. కొందరు తమను తాము నిరూపించుకోడానికి అతిగా ప్రవర్తిస్తుంటారు. అదే వారిపాలిట శాపంగా మారుతుంది. అందుకు ఉదాహరణే ఈ ఘటన. ఓ వ్యక్తి ఓ పెద్ద నాగుపామును పట్టుకున్నాడు. దానిని ఎక్కడో సురక్షితంగా వదలిపెట్టాల్సింది పోయి దాంతో ఆటలాడాడు. చివరికి అది అతన్ని కాటేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.
ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌లో రోడ్డుకు ఇరువైపులా పంటపొలాలు ఉన్నాయి. అక్కడ పొలం గట్టుపైన రాజాసింగ్ అనే వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతని చేతిలో ఓ ఆరడుగుల నాగుపాము ఉంది. అతని చేతిలో భారీ నాగుపామును చూసి స్థానికులు కంగారు పడ్డారు. పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దానిని వదిలిపెట్టాలని రాజాసింగ్‌కి చెప్పారు. అయినా అతను వినిపించుకోకుండా తన ధైర్యాన్ని వాళ్లముందు ప్రదర్శించాలనుకున్నాడు. దీంతో ఆ పామును అటూ ఇటూ తిప్పుతూ.. తలపైకి ఎత్తుకుంటూ విన్యాసాలు చేశాడు. స్థానికులు ఎంత చెప్పినా వినకుండా అతిగా ప్రవర్తించాడు. పామును భుజాలపై వేసుకొని నడుచుకుంటూ వెళ్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసాడు. ఈ క్రమంలో ఆ పాము అతడిని కాటు వేసింది. ఏకంగా మూడు సార్లు పాము కాటువేసింది. దాంతో రాజాసింగ్ పరిస్థితి విషమించింది. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అయితే విష ప్రభావంతో అప్పటికే రాజాసింగ్ మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో కామెంట్లు చేశారు. ఇది ధైర్యం కాదు..మూర్ఖత్వం అని ఒకరు, దీనినే చావును కోరి కౌగిలించుకోవడం అంటారని మరొకరు వ్యాఖ్యానించారు.
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి

