చైనా మాంజా ఎంతపని చేసింది..
చైనా మాంజాలు ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీశాయి.. బైక్‌లపై వెళ్తున్నవారికి మాంజా అడ్డు పడడం.. గొంతుకు తాకడం.. గొంతు తెగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా గుజరాత్ సూరత్‌లో సంక్రాంతి రోజున విషాద ఘటన జరగింది. గాలిపటాలకు ఉపయోగించే మాంజా నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మోటార్‌సైకిల్ అదుపు తప్పి ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడటంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
సూరత్‌కు చెందిన రెహాన్ రహీమ్ షేక్, తన భార్య రెహానా, పదేళ్ల కుమార్తె ఆయేషా తో కలిసి బుధవారం బైక్‌పై వెళ్తున్నారు. చంద్రశేఖర్ ఆజాద్ ఫ్లైఓవర్ వద్దకు రాగానే ఎక్కడి నుంచి వచ్చిందో పతంగి ఎగురవేసే చైనా మాంజా వారికి అడ్డుగా వచ్చింది. ఆ మాంజా వారికి తగలకుండా తప్పించే ప్రయత్నం చేశాడు రహీమ్. ఈ క్రమంలో బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో 70 అడుగుల ఎత్తైన ఫ్లై ఓవర్ పైనుంచి ఒక్కసారిగా కిందపడిపోయారు. బ్రిడ్జికింద నిలిపి ఉన్న ఓ ఆటోపై వారు పడ్డారు. ఈ ప్రమాదంలో రెహాన్, ఆయేషా అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోపై పడిన రెహానాకు తీవ్రంగా గాయపడటంతో ఆమెను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి రెహానా కూడా మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కాగా సంక్రాంతి పండగ రోజుల్లో చైనా మాంజా కారణంగా ఇలాంటి ప్రమాదాలు పరిపాటై పోయాయి. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఎందరో మంజా కారణంగా మృత్యువాత పడ్డారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న గాలిపటాల మాంజాను వెంటనే నిషేదించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
చైనా మాంజా ఎంతపని చేసింది..
సీఎంను చిప్స్ అడిగిన చిన్నారి..ముఖ్యమంత్రి రియాక్షన్ ఇదే!
అక్కడ గ్రాము బంగారం ధర రూ.200 లోపే!
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?

