AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mana Shankarvaraprasad Garu : బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న మన శంకరవరప్రసాద్ గారు.. ఆరు రోజుల్లో ఎంత కలెక్షన్స్ అంటే..

ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సంక్రాంతి సినిమాల్లో మన శంకరవరప్రసాద్ గారు ఒకటి. భారీ హైప్ మీద జనవరి 12న విడుదలైన ఈ మూవీ రోజు రోజుకీ మరింత రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా వింటేజ్ చిరు కామెడీని అడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా కాలం తర్వాత ఫ్యామిలీతో కలిసి అసలైన ఎంటర్టైన్మెంట్ చూసేందుకు అడియన్స్ ఇష్టపడుతున్నారు.

Mana Shankarvaraprasad Garu : బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న మన శంకరవరప్రసాద్ గారు.. ఆరు రోజుల్లో ఎంత కలెక్షన్స్ అంటే..
Mana Shankaravaraprasad Garu
Rajitha Chanti
|

Updated on: Jan 18, 2026 | 1:07 PM

Share

సంక్రాంతి పండగ వాతావరణం ఇంకా థియేటర్లలో కొనసాగుతూనే ఉంది. ఈసారి పండక్కి మెగాస్టార్ చిరంజీవి తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన మన శంకరవరప్రసాద్ గారు సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా జనవరి 12న థియేటర్లలో విడుదలైంది. భారీ హైప్ మధ్య విడుదలైన ఈ మూవీ మొదటి రోజు నుంచే థియేటర్లలో పండగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం.. వింటేజ్ చిరు కామెడీ, డైలాగ్స్, యాక్టింగ్, డ్యాన్స్ స్టెప్స్ చూసి అడియన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత చిరంజీవిని ఫుల్ లెంగ్త్ కమర్షియల్ ఎంటర్టైనర్ లో చూడడంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Actress Raasi: ఉదయాన్నే 4 గంటలకు ఆ పనులు చేస్తా.. నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..

ఇదిలా ఉంటే.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లతో దుమ్మురేపుతున్నారు మన శంకరవరప్రసాద్ గారు. మొదటి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. చిరు కెరీర్ లోనే హయ్యేస్ట్ ఓపెనింగ్ రాబట్టిన సినిమాగా నిలిచింది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.200 కోట్ల క్లబ్ లో చేరి మరో రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక ఐదో రోజు అదనంగా రూ.26 కోట్లు గ్రాస్ రాబట్టి మొత్తం రూ.226 కోట్లకు చేరింది. ఇక ఇప్పుడు ఆరు రోజుల కలెక్షన్స్ ఎంత అనే విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

ఎక్కువ మంది చదివినవి : Prabhas: ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది.. ఆరోజు రాత్రి.. డార్లింగ్ బెస్ట్ ఫ్రెండ్ కామెంట్స్..

ఆరు రోజుల్లోనే ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ.261 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. రోజు రోజుకీ ఈ సినిమా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. శనివారం వీకెండ్ కావడంతో ఈ సినిమాకు అన్ని ఏరియాల్లో మరిన్ని కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. సంక్రాంతి విడుదలైన అన్ని సినిమాలతో పోలిస్తే.. అత్యధిక వసూళ్లతో దూసుకుపోతున్నాడు మన శంకరవరప్రసాద్ గారు. ఆదివారం కూడా ఇదే జోరు కొనసాగితే ఏడు రోజుల్లోనే రూ.300 కోట్ల మార్క్ టచ్ చేయడం ఖయమని తెలుస్తోంది. గతేడాది సంక్రాంతిక వస్తున్నాం సినిమాతో రూ.300 కోట్లు కొల్లగొట్టి అనిల్ రావిపూడి.. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి మరో రికార్డ్ బ్రేక్ చేయడానికి రెడీ అయ్యారు.

ఎక్కువ మంది చదివినవి : Child Artist: షూటింగ్‏లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా.. సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్..