వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కోతుల దాడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో విక్రమ్ అనే యువకుడు బావిలో పడి తీవ్రంగా గాయపడ్డాడు. రెండు గంటల పాటు నరకయాతన అనుభవించిన విక్రమ్‌ను స్నేహితులు, పోలీసులు, ఫైర్ సిబ్బంది కలిసి ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.