ARI Trailer: ‘అరి’ సినిమా ట్రైలర్‌పై వెంకయ్య నాయుడు ప్రశంసల వర్షం.. ఇంతకీ ట్రైలర్‌ను మీరు చూశారా.?
జయశంకర్ దర్శకతవంలో 'అరి' అనే సినిమా తెరకెక్కుతోంది. సాయి కుమార్, అనసూయ, శుభలేక సుధాకర్ వంటి నటీనటులు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. నిజానికి ట్రైలర్ విడుదలయ్యే వరకు ఈ సినిమాపై..
జయశంకర్ దర్శకతవంలో ‘అరి’ అనే సినిమా తెరకెక్కుతోంది. సాయి కుమార్, అనసూయ, శుభలేక సుధాకర్ వంటి నటీనటులు ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. నిజానికి ట్రైలర్ విడుదలయ్యే వరకు ఈ సినిమాపై పెద్దగా ప్రచారం జరగలేదు. కానీ ట్రైలర్ రాగానే ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. సినిమా కాన్సెప్ట్ వైవిధ్యంగా ఉండడంతో ప్రేక్షకుల్లో ఒక్కసారిగా క్యూరియాసిటీ పెరిగిపోయింది. దీంతో ఈ సినిమా ట్రైలర్ గత కొన్ని రోజుల క్రితం ట్రెండింగ్‌లో నిలిచింది.
ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌పై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశసంలు కురపించారు. ట్రైలర్‌ను చూసిన వెంకయ్య నాయుడు ట్విట్టర్ ద్వారా చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ఈ విషయమై వెంకయ్య నాయుడు ట్వీట్ చేస్తూ.. ‘అరి సినిమా ప్రచార చిత్రాన్ని వీక్షించడం ఆనందదాయకం. ఆరు రకాల అంత శత్రువులను ప్రతి మనిషి జయించాలన్న సందేశంతో చక్కని కథ, కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు శ్రీ జయశంకర్, నిర్మాత శ్రీ అభిషేక్ అగర్వాల్ సహా చిత్ర బృందాన్ని అభినందిస్తూ, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చారు.
“అరి” సినిమా ప్రచార చిత్రాన్ని వీక్షించడం ఆనందదాయకం. ఆరు రకాల అంతఃశత్రువులను ప్రతి మనిషి జయించాలన్న సందేశంతో చక్కని కథ,కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు శ్రీ జయశంకర్, నిర్మాత శ్రీ అభిషేక్ అగర్వాల్ సహా చిత్ర బృందాన్ని అభినందిస్తూ,సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను pic.twitter.com/HLeeE5scoF
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) March 29, 2023
ఇక చిత్ర ట్రైలర్ విషయానికొస్తే ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. అరిషడ్వర్గాలోని కామ.. క్రోధ.. లోభ.. మొహ.. మద.. మాత్సర్యాల చుట్టూ తిరిగే కథ ఇది. ‘మనిషి ఎలా బతకకూడదు’ అనే అంశాన్ని కొత్త కోణంలో చూపించారు. మరి ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..