Balagam: ఎంత కష్టమొచ్చిందయ్యా.. బలగం సింగర్‌కు తీవ్ర అనారోగ్యం.. ఆస్పత్రిలో చేరిక!

బలగం సినిమా ఆఖరులో వచ్చే 'తోడుగా మాతోడుండి' అనే పాటను చూసి అందరూ కన్నీరుమున్నీరవుతున్నారు. అంతలా ప్రేక్షకులను కదిలించిన ఈ పాటను ఆలపించింది వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులు.

Balagam: ఎంత కష్టమొచ్చిందయ్యా.. బలగం సింగర్‌కు తీవ్ర అనారోగ్యం.. ఆస్పత్రిలో చేరిక!
Balagam Singers
Follow us
Basha Shek

|

Updated on: Mar 30, 2023 | 5:28 PM

జబర్దస్త్ కమెడియన్‌ వేణు మొదటిసారిగా మెగా ఫోన్‌ పట్టి తెరకెక్కించిన చిత్రం బలగం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించేలా అద్భుతంగా ఈ సినిమాను రూపొందించాడు వేణు. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్‌పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత ఈ ఫీల్‌గుడ్ మూవీని నిర్మించారు. ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరో, హీరోయిన్లుగా నటించారు.ఎలాంటి అంచనాలు లేకుండా.. స్టార్స్‌ లేకుండా.. చిన్న సినిమాగా మార్చి 3న విడుదలైన బలగం వెండితెరపై తన బలాన్నిచూపించింది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. థియేటర్లలో ఇప్పటికీ సందడి చేస్తోన్న ఈ సినిమా ఇటీవలే అమెజాన్‌ ప్రైమ్‌ ద్వారా ఓటీటీలోకి కూడా అందుబాటులోకి వచ్చింది. కాగా ఈ సినిమాకు క్లైమాక్స్‌ ఆయువుపట్టుగా నిలచింది.  ఆఖరులో వచ్చే ‘తోడుగా మాతోడుండి’ అనే పాటను చూసి అందరూ కన్నీరుమున్నీరవుతున్నారు. అంతలా ప్రేక్షకులను కదిలించిన ఈ పాటను ఆలపించింది వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య, కొమురమ్మ దంపతులు. ఈ పాటను అద్భుతంగా ఆలపించడమే కాదు అద్భుతంగా నటించారు మొగిలయ్య దంపతులు. ఇలా తమ గాత్రం, అభినయంతో అందరినీ కన్నీళ్లు పెట్టించిన ఆ దంపతులు.. నిజ జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

శరీరంపై 11 చోట్ల రంధ్రాలు..

మొగిలయ్య దంపతులు బుర్ర కథలు చెప్పుకుంటూనే జీవితం సాగిస్తున్నారు. వీటితో వచ్చిన అరకొర సంపాదనతోనే కడుపునింపుకొంటున్నారు. ఇదీ చాలదన్నట్లు కరోనా సమయంలో మొగిలయ్య రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. దీంతో క్రమం తప్పకుండా డయాలసిస్‌ చేయించుకోవాల్సిన పరిస్థితి. వీరి దీన స్థితిని గమనించిన బలగం డైరెక్టర్‌ వేణు రూ.లక్ష ఆర్థిక సహాయం కూడా అందజేశారు. అలాగే నిర్మాత దిల్‌ రాజుతో మాట్లాడి మరికొంత సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు . అయితే ఇంతలోనే మొగిలయ్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. గత కొంత కాలంగా మొగిలయ్య శరీరం డయాలసిస్‌కు కూడా సహకరించడం లేదంటున్నారు వైద్యులు.డయాలసిస్‍ చేసే క్రమంలో రక్తం ఎక్కించేందుకు అవసరమైన ఆపరేషన్‍ పాయింట్‍ దొరకడం చాలా కష్టంగా ఉందంటున్నారు. దీనికోసం ఇప్పటికే మొగిలయ్య శరీరంపై దాదాపు 11చోట్ల రంధ్రాలు చేశారట. చివరకు ఛాతి మీది నుంచి కూడా రక్తం ఎక్కిస్తున్నారట. ఈక్రమంలోనే మొగిలయ్య తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. ఇక మొగిలయ్య ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ ఉచితంగా చేస్తున్నా.. వారానికి మూడుసార్లు దుగ్గొండి నుంచి వరంగల్​ సంరక్ష ఆస్పత్రికి రావడం కొమురయ్య దంపతులకు ఆర్థికంగా భారంగా మారింది. వరంగల్​కి వచ్చిపోవడానికి తోడూ మందులకు ప్రతినెలా రూ. 20 వేల దాకా ఖర్చు అవుతోందని ఆమె వాపోతుంది. మొగిలయ్య వైద్యం కోసం ఇప్పటికే రూ.14 లక్షలు ఖర్చు చేశామని.. అందులో 6 లక్షల రూపాయలు అప్పులే చేశామని ఆవేదన వ్యక్తం చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..