Dasara movie: కళ్లు బైర్లు కమ్మేలా దసరా థియేట్రికల్ బిజినెస్‌.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ మూవీగా.

నేచురల్ స్టార్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం దసరా. అంటే సుందరానికి చిత్రం డివైడ్‌ టాక్‌ తర్వాత వచ్చిన ఈ సినిమాపై నాని భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఇక సుకుమార్‌ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల తొలిసారి దర్శకుడిగా మారిన ఈ సినిమాపై..

Dasara movie: కళ్లు బైర్లు కమ్మేలా దసరా థియేట్రికల్ బిజినెస్‌.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ మూవీగా.
Dasra Movie
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 30, 2023 | 2:03 PM

నేచురల్ స్టార్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం దసరా. అంటే సుందరానికి చిత్రం డివైడ్‌ టాక్‌ తర్వాత వచ్చిన ఈ సినిమాపై నాని భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఇక సుకుమార్‌ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల తొలిసారి దర్శకుడిగా మారిన ఈ సినిమాపై ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. నాని తన కెరీర్‌లోనే పూర్తి స్థాయిలో మాస్‌ లుక్‌లో కనిపించి ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ చిత్రంపై ఒక్కసారిగా అంచనాలు పెంచేశాయి. ఇక ఈరోజు థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తొలి ఆట నుంచే పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది.

నాని, కీర్తి సురేష్‌ల అద్భుత నటన, శ్రీకాంత్‌ దర్శకత్వ ప్రతిభకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. సినిమాలో మాస్‌ ఎలిమెంట్స్‌, సినిమా టేకింగ్ అద్భుతంగా ఉందంటూ సినిమా చూసినవాళ్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే తెలుగుతోపాటు, మిందీ, మలయాళ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజైన ఈ సినిమా థియేట్రికల్‌ బిజినెస్‌ ఓ రేంజ్‌లో జరిగినట్లు తెలుస్తోంది. దసరా మూవీకి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 47.05 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరగడం విశేషం.

నాని కెరీర్‌లో ఈ స్థాయిలో థియేట్రికల్ బిజినెస్‌ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.47.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌ రావడం ఇప్పట్లో మరే పెద్ద సినిమా విడుదలకు లేకపోవడంతో కలెక్షన్లు రావడం పక్కా అని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదిలా ఉంటే నాని కెరీర్‌లో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా ఎంసీఏ ఉంది. ఈ సినిమా రూ. 40 కోట్లు రాబట్టింది. దీంతో దసరా ఈ రికార్డు బ్రేక్‌ చేసి మరో కొత్త రికార్డ్‌ నెలకొల్పడం ఖాయమని అభిమానులు ఫిక్స్‌ అవుతున్నారు. మరి దసరా ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
చేపల పులుసు తినాలనే కోరిక.. ఇట్టా అయితుంది అనుకోలే..
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
నామాల స్వామికే నామాలు పెట్టాలనుకున్నాడు.! శ్రీవారి హుండీలోనే చోరీ
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
ప్రయాణికులకు అలర్ట్‌.. ఏకంగా 30 రైళ్లు రద్దు.! అదే కారణమా..
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
రాజుకు అవమానం.. ఉదయ్‌పూర్ రాజవంశంలో దాయాదుల పోరు.!
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
ప్రాణం తీసిన పూరి.. అయ్యో చిన్నారి! తినే ఆహారం కూడా పిల్లల ప్రాణం
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
హైదరాబాద్‌ రోడ్లపై రక్త ప్రవాహం.? ఏం జరిగిందోనని భయాందోళనలో స్థాన
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
26 ఏళ్ల క్రితం హత్య... హంతకుడిని పట్టించిన పెండ్లిపత్రిక..
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
మాస్టర్ ప్లాన్ తో తిరుమల దశ తిరుగుతుందా.? మరో 25 ఏళ్ల భవిష్యత్ పై
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర
రైల్వే క్యాటరింగ్ సంస్థపై రూ. లక్ష జరిమానా! ఎంఆర్‌పీ కంటే అధిక ధర