ఛీటింగ్ కేసులో విజయ్‌ నిర్మాతకు మూడేళ్ల జైలు శిక్ష

ఛీటింగ్ కేసులో ప్రముఖ నిర్మాత స్వర్గాచిత్ర అప్పచాన్‌కి మూడేళ్ల జైలు శిక్ష ఖరారైంది. కోలీవుడ్‌ స్టార్ విజయ్‌ నటించిన అళగియ తమిళ్

  • Tv9 Telugu
  • Publish Date - 1:00 pm, Wed, 4 November 20
ఛీటింగ్ కేసులో విజయ్‌ నిర్మాతకు మూడేళ్ల జైలు శిక్ష

Producer Cheating Case: ఛీటింగ్ కేసులో ప్రముఖ నిర్మాత స్వర్గాచిత్ర అప్పచాన్‌కి మూడేళ్ల జైలు శిక్ష ఖరారైంది. కోలీవుడ్‌ స్టార్ విజయ్‌ నటించిన అళగియ తమిళ్ మగన్‌ సినిమా సమయంలో విజయ్ తండ్రి ఏఎస్‌ చంద్రశేఖర్‌తో కోటి రూపాయాలను తీసుకున్న అప్పచాన్‌.. దాన్ని తిరిగి ఇవ్వలేదు. దీనిపై చాలా సంవత్సరాల తరువాత కేసు నమోదైంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇటీవల కోర్టు తీర్పు వెల్లడించగా.. న్యాయస్థానం అప్పచాన్ మూడేళ్ల జైలు శిక్ష విధించింది. కాగా ఈ కేసు అప్పట్లో కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. విజయ్‌తో రెండు సూపర్‌హిట్‌ సినిమాలను తీసిన నిర్మాతపై చంద్రశేఖర్‌ కేసు వేయడం తమిళనాట అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.

Read More:

ప్రముఖ నటుడు ఫరాజ్‌ ఖాన్ కన్నుమూత

ఈ నెల 9 నుంచి చిరంజీవి ‘ఆచార్య’ రీషూటింగ్‌