ఈ నెల 9 నుంచి చిరంజీవి ‘ఆచార్య’ రీషూటింగ్‌

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ఆచార్య. లాక్‌డౌన్‌తో బ్రేక్ పడ్డ ఈ మూవీ షూటింగ్‌ తిరిగి ప్రారంభం అయ్యేందుకు ముహూర్తం ఖరారైంది.

ఈ నెల 9 నుంచి చిరంజీవి 'ఆచార్య' రీషూటింగ్‌
Follow us

| Edited By:

Updated on: Nov 04, 2020 | 11:54 AM

Chiranjeevi Acharya Resume: మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తోన్న చిత్రం ఆచార్య. లాక్‌డౌన్‌తో బ్రేక్ పడ్డ ఈ మూవీ షూటింగ్‌ తిరిగి ప్రారంభం అయ్యేందుకు ముహూర్తం ఖరారైంది. నవంబర్ 9న ఆచార్య మూవీ షూటింగ్‌ని తిరిగి ప్రారంభించనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ( ఎర్రచందనం స్మగ్లర్ల సజీవదహనం కేసులో కొత్త ట్విస్ట్‌)

ఈ మేరకు ట్వీట్ చేసిన కొణిదెల ప్రొడక్షన్ సంస్థ.. నవంబర్ 9 నుంచి జాగ్రత్త చర్యలతో సెట్స్ మీదకు తిరిగి వెళ్లేందుకు చాలా ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు. నెల రోజుల పాటు ఓ లాంగ్ షెడ్యూల్‌ జరగనుంది. ఈ మూవీకి సంబంధించి ఇదే పెద్ద షెడ్యూల్‌. 2021 వేసవిలో థియేటర్‌లలో మెగా మాస్ సందడి మొదలవుతుంది అని కామెంట్ పెట్టారు. (రాజశేఖర్ ఆరోగ్యం చాలా మెరుగ్గా ఉంది: జీవిత)

కాగా ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్‌ నటిస్తుండగా.. రామ్ చరణ్‌ కీ రోల్‌లో మెరవనున్నారు. అజయ్‌, సోనూసూద్‌, హిమజ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్‌, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ( హైదరాబాద్‌లో జోరుగా ఐపీఎల్‌ బెట్టింగ్‌లు)