‘ఖుషి’ ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత

తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన కోలా భాస్కర్(55) కన్నుమూశారు. గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన

  • Tv9 Telugu
  • Publish Date - 1:33 pm, Wed, 4 November 20
'ఖుషి' ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత

Editor Kola Bhaskar: తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన కోలా భాస్కర్(55) కన్నుమూశారు. గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. ‘ఖుషి’, ‘7/జీ బృందావన్ కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే’, ‘3’, ‘కుట్టి’ వంటి చిత్రాలకు ఆయన ఎడిటర్‌గా పనిచేశారు. సెల్వ రాఘవన్‌తో మంచి సాన్నిహిత్యం కలిగిన కోలా భాస్కర్‌.. ఆయన తీసిన పలు చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు. ( ఛీటింగ్ కేసులో విజయ్‌ నిర్మాతకు మూడేళ్ల జైలు శిక్ష)

ఇక ఆయన కుమారుడు కోలా బాలకృష్ణ సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందిన మాలై నేరతు మయక్కమ్(తెలుగులో నన్ను వదిలి నీవు పోలేవుతే) అనే మూవీ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీని కోలా భాస్కర్ నిర్మించారు. మరోవైపు ఆయన మరణంపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. కోలా భాస్కర్ ఆత్మకు శాంతి కలగాలంటూ కోరుకుంటున్నారు. ( ప్రముఖ నటుడు ఫరాజ్‌ ఖాన్ కన్నుమూత)