పవిత్ర ప్రదేశంలో పూనమ్‌పై అసభ్యకర సన్నివేశాల చిత్రీకరణ.. కేసు నమోదు

లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా సినిమాల షూటింగ్‌లకు అనుమతి రావడంతో.. దాదాపుగా అందరు స్టార్లు ఇళ్లను వీడి సెట్స్ పైకి వెళుతున్నారు.

  • Tv9 Telugu
  • Publish Date - 2:04 pm, Wed, 4 November 20
పవిత్ర ప్రదేశంలో పూనమ్‌పై అసభ్యకర సన్నివేశాల చిత్రీకరణ.. కేసు నమోదు

Poonam in controversy: లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా సినిమాల షూటింగ్‌లకు అనుమతి రావడంతో.. దాదాపుగా అందరు స్టార్లు ఇళ్లను వీడి సెట్స్ పైకి వెళుతున్నారు. ఈ క్రమంలో గోవాలోని ప్రముఖ చాపోలీ డ్యామ్‌ పరిసర ప్రాంతాల్లో జరిగే షూటింగ్‌లో వివాదాస్పద నటి పూనమ్‌ పాండే పాల్గొన్నారు. అక్కడ ఆమెపై కాస్త అసభ్యకరమైన సన్నివేశాలను తెరకెక్కించారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ( ‘ఖుషి’ ఎడిటర్ కోలా భాస్కర్ కన్నుమూత)

ఆ ప్రదేశం మల్లిఖార్జున స్వామి భక్తులకు ఎంతో పవిత్రం కాగా పలువురు పూనమ్‌ చేష్టలపై విమర్శలు గుప్పించారు. ఇక గోవాలోని ప్రతిపక్షనేతలు బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అంత పవిత్రమైన ప్రదేశంలో పోర్నోగ్రఫీ చేసేందుకు అనుమతులు ఎలా ఇచ్చారంటూ కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో ఆ వీడియోను తెరకెక్కించిన వ్యక్తితో పాటు పూనమ్‌పై కేసు నమోదైంది. పూనమ్‌పై షూటింగ్ చేసిన వ్యక్తిపై కనకోనా పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇక విమెన్స్ వింగ్ పూనమ్‌పై ఫిర్యాదు చేసింది. ( ఛీటింగ్ కేసులో విజయ్‌ నిర్మాతకు మూడేళ్ల జైలు శిక్ష)