సుశాంత్ కేసు, వెల్లువెత్తిన 1,5 లక్షల ఫేక్ ట్విటర్ అకౌంట్స్, ఎందుకు ?
సుశాంత్ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, ముంబై పోలీసు శాఖను అప్రదిష్ట పాల్జేసేందుకు 1.5 లక్షల ఫేక్ ట్విటర్ అకౌంట్స్ వెల్లువెత్తాయి.

సుశాంత్ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని, ముంబై పోలీసు శాఖను అప్రదిష్ట పాల్జేసేందుకు 1.5 లక్షల ఫేక్ ట్విటర్ అకౌంట్స్ వెల్లువెత్తాయి. సుశాంత్ సూసైడ్ కేసు, దీని దర్యాప్తులో ముంబై పోలీసుల వైఖరిని అపహాస్యం చేస్తూ కొన్ని విదేశాల నుంచి ఫేక్ ట్విటర్ ఖాతాలను తాము కనుగొన్నామని పోలీసులు తెలిపారు. చైనా, పనామా, హాంకాంగ్, నేపాల్ వంటి దేశాలతో సహా మరికొన్ని దేశాల నుంచి వీటిని నిర్వహించారట. ఇండియా నుంచి ఆపరేట్ చేసినవారిలో కొందరు ప్రాక్సీ సర్వర్లను వాడినట్టు వెల్లడైంది. దీనివల్ల తమ ఐడెంటిటీ రహస్యంగా ఉంటుందని వారు భావించారని పోలీసులు అంటున్నారు. ముంబై పోలీసు కమిషనర్ ని కూడా వారు ఈ ఫేక్ అకౌంట్లలో వదలలేదు. ఇందుకు వేర్వేరు హ్యాష్ ట్యాగ్స్ ను వాడారని, ముంబై సైబర్ సెల్ పోలీసులు ఈ యవ్వారంపై దర్యాప్తు చేస్తున్నారని తెలుస్తోంది.