Erica Fernandes: తెరపై బొద్దుగా కనిపించేందుకు అలా చేసేవారు.. చేదు అనుభవాలను గుర్తుకు తెచ్చుకున్న హాట్ బ్యూటీ..
సినిమా అంటేనే రంగుల ప్రపంచం. తెరపై మనకు ఎంతో అందంగా కనిపించే వారి జీవితాల్లో కూడా కొన్ని ఆటుపోట్లు ఉంటాయి.
సినిమా అంటేనే రంగుల ప్రపంచం. తెరపై మనకు ఎంతో అందంగా కనిపించే వారి జీవితాల్లో కూడా కొన్ని ఆటుపోట్లు ఉంటాయి. ఇప్పుడూ సినిమా ఇండస్ట్రీ (cinema industryI లో స్టార్లుగా ఎదిగిన వాళ్లలో చాలామంది ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నవారే. ఈ క్రమంలో వారు అప్పుడప్పుడు తమకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటుంటారు. తాజాగా ‘గాలిపటం’ సినిమా హీరోయిన్ ఎరికా ఫెర్నాండెజ్(Erica Fernandes) కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన సమస్యలను గుర్తుచేసుకుంది. ముఖ్యంగా దక్షిణాది సినిమా ఇండస్ట్రీ (south film industry)లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని వాపోయింది.
ఎంతో ఇబ్బంది పడేదాన్ని!
‘అప్పట్లో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో కొంచెం బొద్దుగా ఉండే హీరోయిన్లనే ఎక్కువగా తీసుకునేవారు. కానీ నేనేమో సన్నగా ఉండేదాన్ని. అందుకే తెరపై కొంచెం లావుగా కనిపించేందుకు నా శరీరంపై ప్యాడ్స్ పెట్టి మేనేజ్ చేయడానికి ప్రయత్నించారు. వాళ్లు అలా చేస్తుంటే నాకు సిగ్గుగా అనిపించేది. చాలా అవమానంగా, అసౌకర్యంగా ఫీలయ్యేదాన్ని. ప్యాడ్స్ పెట్టుకుని నటించేందుకు ఎంతో ఇబ్బంది పడేదాన్ని. దర్శకనిర్మాతలు కోరుకున్నట్లు నేనే లేనేమోనని నాలో నేను మథనపడేదాన్ని. అయితే అదృష్టవశాత్తూ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. అందరికీ సినిమా అవకాశాలు వస్తున్నాయి. ఇది సంతోషకరమైన పరిణామం’ అని ఎరికా చెప్పుకొచ్చింది.
ఎరికా విషయానికొస్తే.. 2010, 2011ల్లో వరుసగా పాంటలూన్స్ ఫెమినా మిస్ ఫ్రెష్ ఫేస్, పాంటలూన్స్ ఫెమినా మిస్ మహారాష్ట్రతో పాటు పలు టైటిళ్లను గెలుచుకుంది. తర్వాత మోడల్‌గా కెరీర్ ప్రారంభించి బుల్లితెర నటిగా అదృష్టం పరీక్షించుకుంది. ఆ తర్వాత వెండితెరపై అడుగుపెట్టి తెలుగు, తమిళం, కన్నడ నటించింది. ‘గాలిపటం’ సినిమాలో ఆది సరసన నటించిన ఎరికా ఆతర్వాత డేగ చిత్రంలోనూ మెప్పించింది. ఆతర్వాత ‘కుచ్ రంగ్ ప్యార్ కే ఐసే భీ’ బాలీవుడ్ బుల్లితెరకు పరిచయమైంది. ప్రస్తుతం సీరియల్స్ తో పాటు అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంటోంది.
Pawan Kalyan: పవర్ స్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. త్వరలోనే భవదీయుడు నుంచి అప్డేట్..