‘దొరసాని’ రివ్యూ

Ravi Kiran

Ravi Kiran | Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 15, 2019 | 9:47 PM

టైటిల్ : ‘దొరసాని’ తారాగణం : ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్, కిషోర్, శరణ్య ప్రదీప్, వినయ్ వర్మ తదితరులు సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి నిర్మాతలు : మధుర శ్రీధర్, యష్ రంగినేని కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కె.వి.మహేంద్ర విడుదల తేదీ: 12-07-2019 ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్‌లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ దర్శకుడు కె.వి. మహేంద్ర తెరకెక్కించిన చిత్రం ‘దొరసాని’. మధుర శ్రీధర్, యష్ రంగినేని కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న […]

'దొరసాని' రివ్యూ

టైటిల్ : ‘దొరసాని’

తారాగణం : ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్, కిషోర్, శరణ్య ప్రదీప్, వినయ్ వర్మ తదితరులు

సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి

నిర్మాతలు : మధుర శ్రీధర్, యష్ రంగినేని

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కె.వి.మహేంద్ర

విడుదల తేదీ: 12-07-2019

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్‌లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ దర్శకుడు కె.వి. మహేంద్ర తెరకెక్కించిన చిత్రం ‘దొరసాని’. మధుర శ్రీధర్, యష్ రంగినేని కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఆడియన్స్‌ను ఏమేరకు మెప్పించగలిగిందో ఈ సమీక్షలో చూద్దాం.

కథ‌ :

1980వ దశకం నాటి ఈ కథలో తక్కువ కులానికి చెందిన ఓ పేద కుటుంబంలో పుట్టిన రాజు(ఆనంద్ దేవరకొండ) దొర చిన్న కూతురైన దొరసాని దేవకి(శివాత్మిక)ను మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. ఇక ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల వల్ల దేవకి కూడా రాజును ఇష్టపడడం మొదలు పెడుతుంది. అయితే అనుకోని విధంగా వారి ప్రేమకు దొర అడ్డుపడతాడు. దీనితో ఒక్కసారిగా కథ మలుపు తిరుగుతుంది. రాజు ప్రేమ కోసం ఎలాంటి కష్టాలు పడ్డాడు? చివరికి రాజు – దేవకి ఒక్కటయ్యారా ? లేదా ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టులు అభినయం:

ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్ ఇద్దరూ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా శివాత్మిక రాజశేఖర్ తన సహజసిద్ధమైన నటనతో అద్భుతంగా నటించింది. ‘దొరసాని’ పాత్రలో ఆమె గంభీరంగా కనిపిస్తూ.. పలికించిన హావభావాలు సినిమాకు హైలైట్ అని చెప్పాలి.

ఇక హీరోయిన్‌కు తండ్రి పాత్రలో నటించిన వినయ్ వర్మ తన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇకపోతే మిగిలిన నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు చక్కటి నటన కనబరిచారు.

విశ్లేష‌ణ‌ :

పేదింటి కుర్రాడు, డబ్బున్న అమ్మాయి మధ్య ప్రేమ అనే కాన్సెప్ట్‌తో ఇప్పటికే చాలా ప్రేమ కథలు వచ్చాయి.. స్టోరీ లైన్ అంతా ఒకటే తప్ప.. కొత్తగా ఏమి ఉండదు. అయితే కథా నేపథ్యంలో మాత్రం ఎటువంటి తప్పు జరగకుండా దర్శకుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో హీరోహీరోయిన్ల మధ్య వచ్చే కొన్ని సీన్స్ సరిగా కుదరలేదు. మరికొన్ని సాగదీత సన్నివేశాలు కూడా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగాల పనితీరు:

కె.వి.మహేంద్ర తన అనుకున్న కథను మంచి నేపథ్యంతో తీర్చిదిద్దాలని చూసినా.. కథనం నెమ్మదించడంతో ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారు. ప్రశాంత్ విహారి సంగీతం అద్భుతంగా ఉంది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :

  • శివాత్మిక రాజశేఖర్,ఆనంద్ దేవరకొండ
  • కథా నేపధ్యం

మైనస్‌ పాయింట్స్‌ :

  • సాగదీత సీన్స్

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu