‘ సూపర్-30 ‘ మూవీ..ఓ .మేథమెటీషియన్.. ఒక షాకింగ్ న్యూస్ !

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించిన ‘ సూపర్-30 ‘ మూవీ శుక్రవారం రిలీజయింది. బీహార్ కు చెందిన మేథమెటీషియన్ ఆనంద్ కుమార్ బయో పిక్ గా దర్శకుడు వికాస్ బెహల్ తీసిన ఈ చిత్రం అప్పుడే మంచి అంచనాలను చేరుకుంటోంది. అయితే.. ఈ సినిమాకు స్ప్హూర్తిమంతంగా నిలిచిన ఈ గణిత శాస్త్రజ్ఞుడి ఆరోగ్యానికి సంబంధించిన విషాద ఉదంతం ఇవాళే బయటికొచ్చింది. ఆనంద్ కుమార్ ఓ బ్రెయిన్ ట్యూమర్ తో బాధ పడుతున్నారట.. ఎకౌస్టిక్ న్యూరోమా అనే […]

' సూపర్-30 ' మూవీ..ఓ .మేథమెటీషియన్.. ఒక షాకింగ్ న్యూస్ !
Follow us

| Edited By: Srinu

Updated on: Jul 12, 2019 | 4:47 PM

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటించిన ‘ సూపర్-30 ‘ మూవీ శుక్రవారం రిలీజయింది. బీహార్ కు చెందిన మేథమెటీషియన్ ఆనంద్ కుమార్ బయో పిక్ గా దర్శకుడు వికాస్ బెహల్ తీసిన ఈ చిత్రం అప్పుడే మంచి అంచనాలను చేరుకుంటోంది. అయితే.. ఈ సినిమాకు స్ప్హూర్తిమంతంగా నిలిచిన ఈ గణిత శాస్త్రజ్ఞుడి ఆరోగ్యానికి సంబంధించిన విషాద ఉదంతం ఇవాళే బయటికొచ్చింది. ఆనంద్ కుమార్ ఓ బ్రెయిన్ ట్యూమర్ తో బాధ పడుతున్నారట.. ఎకౌస్టిక్ న్యూరోమా అనే అరుదైన ట్యూమర్ కారణంగా ఆయన కుడి చెవి క్రమంగా వినికిడి శక్తి కోల్పోతోందట. 2014 లో తన ఈ రుగ్మత గురించి మొదటిసారిగా తనకు తెలిసిందని, అప్పటినుంచి వివిధ ఆస్పత్రుల్లో ఎన్నో టెస్టులు చేయించుకున్నానని ఆయన తెలిపారు. పాట్నాలోని సాధారణ ఆస్పత్రుల నుంచి ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రివరకు ఎన్నో సార్లు చికిత్సలు పొందుతూ వచ్చానని చెప్పారు.తన చెవి నుంచి మెదడుకు దారితీసే నాడిలో ఏర్పడిన ట్యూమర్ (కణితి) క్యాన్సర్ కాకపోయినా..ఇది మరింత ముదిరితే తీవ్రమైన తలనొప్పి, నీరసం, చివరకు పక్షవాతంకూడా సోకవచ్ఛునని డాక్టర్లు చెప్పారని ఆనంద్ కుమార్ వెల్లడించారు. ‘ నువ్వు మరో పదేళ్లు మాత్రమే బతుకుతావు ‘ అని వైద్యులు చెప్పినప్పుడు తన నవనాడులూ కుంగిపోయాయన్నారు. ప్రస్తుతం ఆనంద్ కుమార్ వయస్సు 46 ఏళ్ళు.’.నేను జీవించి ఉండగానే ఈ బయోపిక్ తీయాలని బాలీవుడ్ మేకర్స్ ని కోరాను.. నా డైలీ లైఫ్ పై హీరో హృతిక్ రోహన్ 150 గంటల వీడియో తీయడం నాకెంతో ఆనందం కలిగించింది ‘ అని ఆయనచెప్పారు. ఒక అద్భుత గణిత శాస్త్రజ్ఞుడి బయోపిక్ విడుదలైన రోజే ఆయన చెప్పిన ఈ విషయాలు ముఖ్యంగా బాలీవుడ్ కి, ఆయన అభిమానులకు షాకింగ్ న్యూసే..