AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హిమగిరుల్లో ప్రళయం.. వేల బతుకులు నేలమట్టం.. రాకాసి ముప్పెనకు అసలు కారణమేంటి?

నేపాల్‌-టిబెట్‌ సరిహద్దుల్లో సంభవించిన భారీ వరదలు హిమాలయాల్లో పెరుగుతున్న విపత్తు ముప్పును మరోసారి బయటపెట్టాయి. గ్లేషియర్లు కరగడం, హిమ సరస్సులు విస్తరించడం, మంచు-కొండచరియలు విరిగిపడటం, ఆకస్మికంగా నదులు ఉప్పొంగడం వంటి కారణాలు ఫ్లాష్‌ ఫ్లడ్స్‌కు దారితీస్తున్నాయి. భోటేకోషి, త్రిశూలి నదీ లోయల్లో జరిగిన విధ్వంసం నేపథ్యంలో సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌, లడఖ్‌తో పాటు పశ్చిమ బెంగాల్‌, అసోం వంటి ప్రాంతాలకూ భవిష్యత్తులో ముప్పు ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హిమగిరుల్లో ప్రళయం.. వేల బతుకులు నేలమట్టం.. రాకాసి ముప్పెనకు అసలు కారణమేంటి?
Nepal Flash Floods
Shaik Madar Saheb
| Edited By: |

Updated on: Aug 27, 2026 | 10:00 PM

Share

ఉడుకునెత్తురు బారిన పడ్డ నేపాల్‌.. జెన్‌జీ ఉప్పెనతో అట్టుడిగిపోయి, నిరసనల నిప్పురవ్వ ఆ దేశాన్ని నిలువునా తగలబెట్టింది గుర్తుందా? ఏడాదైనా గడిచిందో లేదో.. నేపాల్ గుండె మీద మళ్లీ కోలుకోలేని దెబ్బ. రాజకీయ అస్థిరత నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న నేపాల్‌కి మళ్లీ చావుదెబ్బ.. ఈసారి కొట్టింది నేచర్. విరుచుకుపడింది జలఖడ్గం. గత ఆగస్టులో నేపాల్‌ అల్లర్లపై ఆందోళన వ్యక్తం చేసి, ఆపన్న హస్తం అందించిన ప్రపంచసమాజం.. ఇప్పుడు జల ప్రళయం నుంచి నేపాల్‌ని కాపాడాలంటూ దేవుణ్ణి ప్రార్థిస్తోంది. ఇలా ఏడాదికోసారి వరసబెట్టి ఓదార్పును కోరుకుంటున్న నేపాల్‌ దేశానికి.. అసలేమైంది? ప్రకృతిని ప్రేమించడం కాదు, ప్రకృతికి కాపలా ఉండి, ప్రకృతిని ప్రకృతిగా ఉంచినంతవరకే మనిషికి బతుకు! కాదంటే అదే ప్రకృతి వెంటబడి వేటాడేస్తది. మెరుపు వరదలొచ్చి, పెద్దపెద్ద ఇంజనీరింగ్ అద్భుతాలే నేలమట్టమైపోయి, శతాబ్దానికి సరిపడా చేదుజ్ఞాపకాల్ని రిటర్న్ గిఫ్టుగా ఇచ్చి వెళుతోంది.. నేపాల్‌ బీభత్సం. నేచర్ తిరగబడితే ఏమౌతుందో, ఎంతెంత మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందో కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. నేపాల్ వరద విపత్తు నుంచి రాసిపెట్టుకోవాల్సిన గుణపాఠాల్లో ఇది మొదటిది. మిగతావైతే బోలెడన్ని. వీటిలో కొన్ని మానవ తప్పిదాలు, మరికొన్ని పొరుగు దేశాలు పాల్పడే చాటుమాటు ద్రోహాలు. అన్నీ కలిసి నేపాల్ బతుకును నేలకేసిబాదేశాయి. త్రిశూలి నదిపై బ్రిడ్జిని కోసుకెళ్తున్న ఈ వీడియో ఒక్కటిచాలు.. అక్కడొచ్చిన వరద ఉధృతి ఎంతో చెప్పడానికి. మాగ్జిమమ్ అంచనాకు మించి ప్రవహించిన నీళ్లు.. జనావాసాల మీదికి ఉప్పెనలా వచ్చిపడ్డాయి. అందుకే, ఇంతటి భారీగా...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి