AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘రోహన్’ పేరు చెక్కాలంటూ బాలికకు వేధింపులు.. అంతర్జాతీయ గ్యాంగ్‌ వెనుక భారతీయుడు?

మైనర్ బాలికలను ఆన్‌లైన్‌లో లక్ష్యంగా చేసుకుని లైంగికంగా వేధించడంతో పాటు, వారితో బలవంతంగా స్వీయహింసకు పాల్పడేలా చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయుడిపై ఫ్రాన్స్‌లో విచారణ ప్రారంభమైంది. రోహన్ సందీప్ రాణే (29) CVLT గ్రూప్‌కు నాయకత్వం వహించినట్లు దర్యాప్తు అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో విచారణ పారిస్‌లోని ప్రత్యేక న్యాయస్థానంలో సోమవారం ప్రారంభమైంది.

'రోహన్' పేరు చెక్కాలంటూ బాలికకు వేధింపులు.. అంతర్జాతీయ గ్యాంగ్‌ వెనుక భారతీయుడు?
Indian Man Rohan Rana Behind Global Paedophile Ring
Sharada V
|

Updated on: Oct 06, 2026 | 7:51 PM

Share

ఈ గ్రూపు నాజీ భావజాలం, హింసాత్మక సిద్ధాంతాలు, బాలలపై లైంగిక దోపిడీని ప్రోత్సహించేదని దర్యాప్తు సంస్థలు కోర్టుకు తెలిపాయి. ఈ నెట్‌వర్క్‌ అమెరికా, బ్రిటన్‌, నెదర్లాండ్స్‌, ఎస్టోనియా ఇతర దేశాల్లోని మైనర్ బాలికలను లక్ష్యంగా చేసుకుంది. రాణే పై నేరం రుజువైతే జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.

2020లో వెలుగులోకి వచ్చిన కేసు

ఈ వ్యవహారం 2020లో బయటపడింది. అమెరికాకు చెందిన ‘తప్పిపోయిన, దోపిడీకి గురైన పిల్లల జాతీయ కేంద్రం (NCMEC) ఆన్‌లైన్‌లో ఒక 12 ఏళ్ల బాలికకు సంబంధించిన అభ్యంతరకరమైన చిత్రాలను గుర్తించింది. దర్యాప్తులో భాగంగా.. ఆ బాలిక తన శరీరంపై ‘రోహన్‌’ అనే పేరు చెక్కుకునేలా ఎవరో ఒత్తిడి చేసినట్లు అధికారులు గుర్తించారు. ఆ ఘటన ఆధారంగా దర్యాప్తు విస్తరించడంతో CVLT ఆన్‌లైన్ నెట్‌వర్క్‌ కార్యకలాపాలు బయటపడ్డాయి.

సోషల్ మీడియా ద్వారా బాలికలే టార్గెట్‌

CVLT సభ్యులు ఇన్‌స్టాగ్రామ్‌, డిస్కార్డ్‌ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మైనర్ బాలికలను సంప్రదిస్తారు. అప్పటికే లైంగిక వేధింపులకు గురైన, ఇతర కారణాలతో బలహీన పరిస్థితుల్లో ఉన్న బాలికలను లక్ష్యంగా చేసుకుంటారు. బాలికలతో పరిచయం పెంచుకుని వారి నుంచి వ్యక్తిగత, అభ్యంతరకర ఫొటోలను తీసుకుంటారు. ఆ తర్వాత వాటిని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపుతామని, ఇంటర్నెట్‌లో ప్రచురిస్తామని బెదిరిస్తారనీ దర్యాప్తులో వెల్లడైంది. కొన్ని సందర్భాల్లో అత్యవసర సేవలకు నకిలీ ఫోన్‌ కాల్స్‌ చేసి పోలీసులను బాధితుల ఇళ్లకు పంపిస్తామని కూడా బెదిరించినట్లు అధికారులు తెలిపారు.

స్వీయహింసకు పాల్పడేలా ఒత్తిడి

బాధితులను తీవ్రమైన, అవమానకరమైన చర్యలకు పాల్పడేలా CVLT సభ్యులు ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితులు తమను తాము గాయపరుచుకోవడం, అవమానకరమైన చర్యలు చేయడం, తమ శరీరంపై గ్రూప్ సభ్యుల పేర్లు లేదా నాజీ గుర్తులు చెక్కుకోవడం వంటి చర్యలకు పాల్పడేలా బలవంతం చేసారు. ఆత్మహత్య చర్యను వీడియోలో రికార్డు చేసి లైవ్‌స్ట్రీమ్‌ చేయాలని కూడా ఒత్తిడి చేసారని ఆరోపణలున్నాయి. CVLT సభ్యులు తమను తాము ‘వార్‌లార్డ్స్‌’గా పిలుచుకునేవారని,  బాధితుల్లో పలువురు మైనర్ బాలికలని, వారిని బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌ ద్వారా తమ నియంత్రణలో ఉంచుకునేవారనీ అంతేకాదు నెట్‌వర్క్‌ సభ్యులు జాత్యహంకార, యూదు వ్యతిరేక, మహిళా వ్యతిరేక భావజాలాన్ని కూడా వ్యాప్తి చేసారనీ దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి.

ఫ్రాన్స్‌కు ఎలా వచ్చాడు?

దక్షిణ ఫ్రాన్స్‌లోని యాంటిబ్స్‌లో బిజినెస్‌ కోర్సు  చదివిన రాణే  ఆ  తర్వాత ఫిట్‌నెస్‌ కోచ్‌గా పనిచేసాడు. 2021లో అతడిని అరెస్టు చేసి మైనర్లపై లైంగిక దోపిడీ,  చిత్రహింసలకు పాల్పడటం,  బెదిరించి డబ్బులు గుంజడం, ఇతర ప్రయోజనాలు పొందడం, బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన మెటీరియల్‌ను వ్యాప్తి చేయడం వంటి తీవ్రమైన అభియోగాలు అతడిపై మోపారు.

అమెరికా ప్రాసిక్యూటర్లను బెదిరించాడా?

ప్రస్తుతం రాణే ను పారిస్ కోర్టులో తలుపులు మూసేసి నిర్వహిస్తున్నారు. ఈ కేసులో బాధితులు, సాక్షులను, అమెరికా ప్రాసిక్యూటర్లను బెదిరించినట్లు ఫ్రెంచ్ అధికారులు కోర్టుకు తెలిపారు. కేసు విచారణలో భాగంగా బాధితులపై జరిగిన హింసకు సంబంధించిన వీడియోలను కోర్టు పరిశీలించనుంది. అందుకే విచారణను బహిరంగంగా నిర్వహించడం లేదు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో వ్యక్తి కాలెబ్ క్రిస్టోఫర్ మెరిట్ ఇప్పటికే అమెరికాలో 50 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.  బాలలపై లైంగిక నేరాలకు పాల్పడిన కేసులో 2021లో అతడికి శిక్ష పడింది.  కాగా, రాణే కేసులో విచారణ ఈ వారం కొనసాగనుంది. ఆరోపణలు రుజువైతే అతడికి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.

Follow Us
అంతర్జాతీయ వేధింపుల గ్యాంగ్‌ వెనుక భారతీయుడు!
అంతర్జాతీయ వేధింపుల గ్యాంగ్‌ వెనుక భారతీయుడు!
‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
‘కోర్టు’ హీరోయిన్ కొత్త సినిమా ట్రైలర్
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్
హాయిగా నిద్రపోండి-లక్షల్లో గెలుచుకోండి! వినూత్న స్లీప్ కాంపిటీషన్
వైధృతి యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో ఈ 3 రాశుల వారు జాగ్రత్త..!
వైధృతి యోగం.. ఉద్యోగం, వ్యాపారంలో ఈ 3 రాశుల వారు జాగ్రత్త..!
ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ చేతికి వైమానిక దళ పగ్గాలు!
ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ చేతికి వైమానిక దళ పగ్గాలు!
భారత్‌లో డెబ్యూ మ్యాచ్ ఇప్పట్లో లేనట్టే వైభవ్.. అసలు విలన్ ఎవరు?
భారత్‌లో డెబ్యూ మ్యాచ్ ఇప్పట్లో లేనట్టే వైభవ్.. అసలు విలన్ ఎవరు?
దేవుడి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సేవ బుక్ చేస్తున్నారా..? జాగ్రత్త!
దేవుడి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సేవ బుక్ చేస్తున్నారా..? జాగ్రత్త!
ఎట్టకేలకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట!
ఎట్టకేలకు ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి ఊరట!
కీలక నిర్ణయం.. ఇక 9 నెలల గడువు.. బైక్‌ ట్యాక్సీలకు కొత్త రూల్స్‌
కీలక నిర్ణయం.. ఇక 9 నెలల గడువు.. బైక్‌ ట్యాక్సీలకు కొత్త రూల్స్‌
మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం.. కేంద్ర కేబినెట్ కీలక తీర్మానం..
మోదీ 25 ఏళ్ల పాలనా ప్రస్థానం.. కేంద్ర కేబినెట్ కీలక తీర్మానం..