AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda: ఈఎంఐల్లో ఐఫోన్ కొంటున్నారా? అయితే ఒక్కసారి హీరో విజయ్ మాటలు వినండి

టాలీవుడ్ రౌడీ బాయ్, హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం రణబాలి సినిమా షూటింగ్ లో బిజి బిజీగా ఉంటున్నాడు. ఈ సినిమాలో విజయ్ భార్య నేషనల్ క్రష్ రష్మికనే హీరోయిన్ గా చేస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో విజయ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Vijay Deverakonda: ఈఎంఐల్లో ఐఫోన్ కొంటున్నారా? అయితే ఒక్కసారి హీరో విజయ్ మాటలు వినండి
Vijay Deverakonda
Basha Shek
|

Updated on: Oct 06, 2026 | 8:44 PM

Share

టాలీవుడ్ రౌడీ బాయ్, హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘రణబాలి’. గతంలో విజయ్ తో కలిసి ట్యాక్సీవాలా వంటి సూపర్ హిట్ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ దసరా కానుకగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో రణబాలి సినిమా ప్రమోషన్లలో విస్తృతంగా పాల్గొంటున్నారు విజయ్- రష్మిక. వరుసగా ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయ్‌ దేవరకొండకు తన స్మార్ట్‌ఫోన్‌ గురించి ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. టీమిండియా క్రికెటర్ విరాట్‌ కోహ్లీ వంటి స్టార్ సెలబ్రిటీలు కూడా కొత్త మోడళ్లు వచ్చినా పాత ఐ ఫోన్లనే ఉపయోగిస్తున్న విషయాన్ని యాంకర్‌ ప్రస్తావించారు. ‘ మీరు కూడా మంచి సంపాదన ఉన్న నటుడే కదా.. మరి కొత్త ఐఫోన్‌ ఎందుకు కొనలేదు’ అని విజయ్‌ని ప్రశ్నించారు. దీనికి విజయ్‌ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ‘ ప్రస్తుతం నా దగ్గర ఉన్న ఫోన్ బాగానే పని చేస్తోంది. అది ఇప్పుడు నా అవసరాలను తీర్చుతున్నప్పుడు కొత్త ఫోన్‌ కొనాల్సిన అవసరం ఏముంది. అయినా పెద్ద హీరోలు, ప్రముఖులకు పలు సంస్థలు ఫోన్లు, గ్యాడ్జెట్లు, ఇతర ఖరీదైన వస్తువులను బహుమతులుగా ఇస్తుంటాయి. అందుకే సెలబ్రిటీలు ఉపయోగించే ప్రతి వస్తువును వారు సొంత డబ్బుతో కొనుగోలు చేస్తారని భావించకూడదు’ అని విజయ్ చెప్పుకొచ్చారు

ఇక ఐఫోన్ లాంటి ఖరీదైన వాటిని కొనుగోలు చేసి దాన్ని సోషల్‌ మీడియాలో చూపించుకోవాలనే ఆలోచనలపై కూడా విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఇంటి ఖర్చులను కూడా సరిగా నిర్వహించలేని పరిస్థితుల్లో కేవలం స్టేటస్‌ సింబల్ కోసం అప్పు చేసి ఖరీదైన ఫోన్‌ కొనడం సరైన నిర్ణయం కాదు. నిజంగా అవసరమైతేనే డబ్బు ఖర్చు చేయవచ్చు. కానీ కేవలం ఇతరులకు చూపించుకోవడం కోసం అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకూడదు’ అని సందేశమిచ్చాడు విజయ్. ప్రస్తుతం ఈ టాలీవుడ్ హీరో కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ‘ఖరీదైన ఫోన్ల కోనుగోలు విషయంలో విజయ్ ఆలోచన కరెక్టే’ అని నెటిజన్లు విజయ్ కు మద్దతుగా నిలుస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
ఈఎంఐల్లో ఐఫోన్ కొంటున్నారా? ఒక్కసారి హీరో విజయ్ మాటలు వినండి
ఈఎంఐల్లో ఐఫోన్ కొంటున్నారా? ఒక్కసారి హీరో విజయ్ మాటలు వినండి
ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలో విషాదం.. గ్రెనేడ్ పేలి చేయి ఛిద్రం
ఫ్రాన్స్‌ విద్యార్థుల ఆందోళనలో విషాదం.. గ్రెనేడ్ పేలి చేయి ఛిద్రం
రాత్రి పడుకునే ముందు ఈ యోగాసాలు చేయండి.. క్షణాల్లో గాఢ నిద్రలోకి
రాత్రి పడుకునే ముందు ఈ యోగాసాలు చేయండి.. క్షణాల్లో గాఢ నిద్రలోకి
మెయిడీన్ ఓవర్లలో మొనగాళ్లు.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?
మెయిడీన్ ఓవర్లలో మొనగాళ్లు.. టాప్ ప్లేస్ ఎవరిదంటే?
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
US F1 వీసా స్లాట్‌ కోసం రూ.20 వేలు డిమాండ్.. ఇంటర్వ్యూ రద్దు
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?
వెంటిలేటర్‌పై ప్రాణాలతో పోరాడుతోన్న 'అగ్గిపెట్టె మచ్చ'..ఏమైందంటే?
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీబీఐ సోదాలు..!
ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీబీఐ సోదాలు..!
గురు నక్షత్ర గోచారంతో వీరికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు
గురు నక్షత్ర గోచారంతో వీరికి కొత్త అవకాశాలు, ఆర్థిక లాభాలు
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు
టెర్మినేటర్ సీన్ రిపీట్! వేడి లావాలోకి దూకేసిన హ్యూమనాయిడ్ రోబోలు
SIRపై ఢిల్లీలో రణరంగం.. రాహుల్ గాంధీ అరెస్ట్!
SIRపై ఢిల్లీలో రణరంగం.. రాహుల్ గాంధీ అరెస్ట్!