AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తన స్వరానికి ట్రేడ్‌మార్క్ కోరిన ఇటలీ ప్రధాని మెలోనీ

AI టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ డీప్‌ఫేక్‌ ముప్పు పెరుగుతోంది. ప్రముఖులు చెప్పని మాటలను వారు చెప్పినట్టుగా చూపించడం, వారి గొంతును క్లోన్ చేసి నకిలీ ఆడియోలు తయారు చేయడం ఈజీగా మారింది. తన గొంతుకు ట్రేడ్‌మార్క్‌ ఇవ్వాలని దరఖాస్తు చేసారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలొనీ తన స్వరానికి చట్టపరమైన రక్షణ కల్పించాలని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ (EUIPO)కు దరఖాస్తు చేసుకున్నారు.

తన స్వరానికి ట్రేడ్‌మార్క్ కోరిన ఇటలీ ప్రధాని మెలోనీ
Taly Meloni Seeks Legal Protection For Her Voice Against Ai Generated Deepfakes
Sharada V
|

Updated on: Oct 06, 2026 | 5:45 PM

Share

నాలుగు సెకన్ల ఆడియో రికార్డింగ్ ను  మెలనీ సమర్పించారు. అందులో తన పేరును ఇటాలియన్ భాషలో రెండుసార్లు పలికారు. 2019 రాజకీయ ర్యాలీలో మెలోనీకి ఎంతో గుర్తింపు తెచ్చిన పదం ‘లొ సోనో జార్జియా’. 2021లో విడుదలైన ఆమె ఆత్మకథకు కూడా ‘Io sono Giorgia’ అనే పేరునే పెట్టారు. ఈ పుస్తకం భారతీయ ఎడిషన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ముందు మాట రాశారు.

గొంతుకు ట్రేడ్‌మార్క్ ఏంటి?

మెలోనీ గొంతుకు ట్రేడ్‌మార్క్‌ గనక నమోదైతే.. ఇకపై ఎవరూ ఆమె గొంతును ఏఐతో అనుకరించలేరని అర్థం కాదు. ఆమె ఆడియో గుర్తింపును ఆమె అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించినప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఏఐ ఆధారిత వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు అసలైన వాయిస్ నమూనా ఆధారంగా ఒక వ్యక్తి గొంతును పోలిన ఆడియోను రూపొందించడం తేలిక. దీంతో ప్రముఖులు అసలు చెప్పని మాటలను వారు చెప్పినట్లు చూపించే ప్రమాదం పెరిగింది. రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, వ్యాపారవేత్తల గొంతులను ఉపయోగించి నకిలీ ప్రకటనలు, రాజకీయ సందేశాలు, మోసపూరిత ఆడియోలు రూపొందించే అవకాశం ఉంది.

డీప్‌ఫేక్‌ పై గతంలో మెలోనీ ఆందోళన

డీప్‌ఫేక్‌లతో ప్రజలను మోసం చేయడం, ప్రభావితం చేయడం, నష్టపరచడం జరుగుతుందని మెలోనీ గతంలో హెచ్చరించారు. తన నకిలీ చిత్రాలు ఆన్‌లైన్‌లో ప్రచారం కావడంపై స్పందిస్తూ తనను తాను కాపాడుకోగలనని, కానీ చాలా మందికి ఆ అవకాశం ఉండదని అన్నారు. ఇప్పుడు తన గొంతుకు ట్రేడ్‌మార్క్ రక్షణ కోరడం ద్వారా ఏఐ ఆధారిత నకిలీ కంటెంట్‌పై చట్టపరమైన పోరాటానికి మరో మార్గాన్ని సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఫొటోలు, వీడియోలు, వాయిస్ డీప్‌ఫేక్‌లు పెరుగుతున్నాయి. ఒక వ్యక్తి గొంతును అనుకరించి నకిలీ ఫోన్ కాల్స్ లేదా ఆడియో సందేశాలు సృష్టించడం ఈజీగా చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, ప్రముఖుల స్వరాన్ని దుర్వినియోగం చేయకుండా రక్షణ కల్పించేందుకు చట్టాల అవసరం పెరుగుతోంది. మెలోనీ దరఖాస్తును EUIPO ఆమోదిస్తుందా? ఆమె గొంతుకు ట్రేడ్‌మార్క్ హక్కులు లభిస్తాయా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మెలోనీని వెంటాడుతున్న డీప్‌ఫేక్‌

ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి డీప్‌ఫేక్‌లు కొత్త సమస్య కాదు. ఆమె ముఖాన్ని ఉపయోగించి రూపొందించిన మార్ఫింగ్ చిత్రాలు గతంలో పలుమార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అందులో ఆమెను తప్పుగా చూపించిన లైంగిక కంటెంట్ కూడా ఉంది. ఈ వ్యవహారంపై 2024లో మెలోనీ ఇటలీ కోర్టును ఆశ్రయించారు. సార్డీనియాకు చెందిన ఓ వ్యక్తి తన ముఖాన్ని ఉపయోగించి నకిలీ అశ్లీల చిత్రాలను రూపొందించి, వాటిని ఆన్‌లైన్‌లో ప్రచారం చేశాడని ఆమె ఆరోపించారు. ఈ కేసు ప్రస్తుతం ఇటలీ కోర్టులో పెండింగ్‌లో ఉంది.ఇప్పుడు తన గొంతుకు ట్రేడ్‌మార్క్‌ నమోదుకు మెలోనీ తీసుకున్న నిర్ణయం కూడా ఈ తరహా అనధికార డిజిటల్ వినియోగాన్ని ఎదుర్కొనే ప్రయత్నంలో భాగంగానే కనిపిస్తోంది.

ప్రముఖుల గొంతులకు చట్టపరమైన రక్షణ

డిజిటల్ టెక్నాలజీ అభివృద్ధితో తమ గొంతు, ముఖం, వ్యక్తిత్వానికి సంబంధించిన ప్రత్యేక లక్షణాల రక్షణకు ప్రముఖులు ప్రయత్నిస్తున్నారు. ఇటలీకి చెందిన గాయని జ్యూసీ ఫెర్రెరి కూడా తన గొంతుకు వాయిస్ మార్క్‌ను నమోదు చేసుకున్నారు. ప్రముఖ ఇటాలియన్ వాయిస్ యాక్టర్ లూకా వార్డ్ కూడా తన ప్రత్యేకమైన గొంతుకు ట్రేడ్‌మార్క్ రక్షణ కోరారు. అంతర్జాతీయంగా కూడా ఏఐ రూపొందించే నకిలీ స్వరాలు, చిత్రాలపై పలువురు సెలబ్రిటీలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రముఖ గాయని టేలర్ స్విఫ్ట్, నటి స్కార్లెట్ జొహాన్సన్ వంటి వారు ఏఐ ద్వారా తమ రూపం లేదా గొంతును పోలిన కంటెంట్‌కి సంబంధించిన వివాదాలను ఎదుర్కొన్నారు. స్కార్లెట్ జొహాన్సన్‌ ప్రత్యేకంగా ఒక ఏఐ వాయిస్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను పోలిన ఆ వాయిస్‌ను రూపొందించే ప్రాజెక్టులో పాల్గొనడానికి తాను నిరాకరించినప్పటికీ, ఆ వాయిస్ తన స్వరానికి దగ్గరగా ఉందని ఆమె పేర్కొన్నారు. అయితే ఆ వాయిస్‌ను ఉద్దేశపూర్వకంగా జొహాన్సన్ గొంతును కాపీ చేసి రూపొందించలేదని ఓపెన్‌ఏఐ తెలిపింది. అనంతరం ఆ ఫీచర్‌ను తొలగించింది.

Follow Us
తన స్వరానికి ట్రేడ్‌మార్క్ కోసం ఇటలీ ప్రధాని మెలోనీ దరఖాస్తు
తన స్వరానికి ట్రేడ్‌మార్క్ కోసం ఇటలీ ప్రధాని మెలోనీ దరఖాస్తు
రెండు తలలు, నాలుగు కళ్లతో అరుదైన వుల్ఫ్ స్నేక్ ప్రత్యక్షం!
రెండు తలలు, నాలుగు కళ్లతో అరుదైన వుల్ఫ్ స్నేక్ ప్రత్యక్షం!
చేపల చెరువుల్లో ఆక్సిజన్ కొరత.. రైతులు పాటించాల్సిన కీలక జాగ్రత్త
చేపల చెరువుల్లో ఆక్సిజన్ కొరత.. రైతులు పాటించాల్సిన కీలక జాగ్రత్త
పాకిస్తాన్‌కు తలనొప్పిలా మన తెలుగోడు..
పాకిస్తాన్‌కు తలనొప్పిలా మన తెలుగోడు..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. షట్‌డౌన్ vs రీస్టార్ట్ మధ్య..
అరెరె ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. షట్‌డౌన్ vs రీస్టార్ట్ మధ్య..
BSNL బంపర్ ఆఫర్.. తక్కువ రీఛార్జ్‌తో ఇప్పుడు 380 రోజుల వ్యాలిడిటీ
BSNL బంపర్ ఆఫర్.. తక్కువ రీఛార్జ్‌తో ఇప్పుడు 380 రోజుల వ్యాలిడిటీ
కారులో వచ్చి మేకలు ఎత్తుకెళ్లిన దొంగలు!
కారులో వచ్చి మేకలు ఎత్తుకెళ్లిన దొంగలు!
పాకిస్థాన్ క్రికెట్‌కు దిమ్మతిరిగి పోయిందిగా..
పాకిస్థాన్ క్రికెట్‌కు దిమ్మతిరిగి పోయిందిగా..
ఆలయాన్నే టార్గెట్ చేసిన కేటుగాడు... ఒకే గుడిలో వరుస చోరీలతో కలకలం
ఆలయాన్నే టార్గెట్ చేసిన కేటుగాడు... ఒకే గుడిలో వరుస చోరీలతో కలకలం
కుజుడు, గురువు అనుగ్రహం.. ఈ రాశుల వారు స్థిరాస్తులు కొనే ఛాన్స్..
కుజుడు, గురువు అనుగ్రహం.. ఈ రాశుల వారు స్థిరాస్తులు కొనే ఛాన్స్..