AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Toxic Movie: నయనతార, టాక్సిక్ డైరెక్టర్ కలిసి నటించిన సినిమా ఏంటో తెలుసా..

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ నయనతార. జవాన్ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు యశ్ నటించిన టాక్సిక్ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించింది. అయితే నయనతార ఇప్పటికే దర్శకురాలు గీతూ మోహన్‌దాస్‌తో ఒక చిత్రంలో పనిచేశారు. ఆ సినిమా గురించి ఇటీవల టాక్సిక్ ప్రమోషన్లలో ప్రస్తావించారు నయనతార.

Toxic Movie: నయనతార, టాక్సిక్ డైరెక్టర్ కలిసి నటించిన సినిమా ఏంటో తెలుసా..
Nayanthara, Geethu Mohan Da
Rajitha Chanti
|

Updated on: Aug 27, 2026 | 9:07 PM

Share

లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో స్టార్ హీరోలతో వరుస సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా సినీరంగంలో చక్రం తిప్పుతుంది. హరి దర్శకత్వం వహించిన 2005 చిత్రం ‘అయ్యా’తో నయనతార తమిళ చిత్రసీమలో కథానాయికగా అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ.. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. ఒక మలయాళ టెలివిజన్ ఛానల్‌లో ప్రజెంటర్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించి, ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో దూసుకుపోతున్నారు. 2026లో విడుదలైన ‘టాక్సిక్’ ఒక భారీ చిత్రం, ఇందులో నయనతార ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రానికి మహిళా దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్..

అయితే గతంలో గీతూ మోహన్ దాస్ కథానాయికగా అనేక చిత్రాల్లో నటించారు. తెలుగుతోపాటు మలయాళంలో పలు సినిమాల్లో మెప్పించారు. అయితే నయనతార, గీతూ మోహన్‌దాస్ కలిసి నటించిన చిత్రం ఏంటో మీకు తెలుసా? నయనతార, దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ 2005లో విడుదలైన మలయాళ చిత్రం ‘రప్పగల్’లో కలిసి పనిచేశారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి కథానాయకుడిగా నటించడం గమనార్హం. అప్పట్లో వీరిద్దరు కలిసి నటించిన సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి :  Bigg Boss : నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు.. అందుకే చచ్చిపోవాలనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..

చాలా కాలంపాటు సినిమాలకు దూరంగా ఉన్న గీతూ మోహన్ దాస్. ఇప్పుడు దర్శకురాలిగా మారారు. భారీ అంచనాల మధ్య విడుదలైన టాక్సిక్ సినిమాకు మిశ్రమ స్పందన వస్తుంది. ఇందులో కియారా అద్వానీ, నయనతార, రుక్మిణి వసంత్, తారా సుతారియా, హుమా ఖురేషీ కీలకపాత్రలు పోషించారు.

ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..

Follow Us
అప్పుడు కలిసి నటించారు.. ఇప్పుడు కలిసి సినిమా చేశారు..
అప్పుడు కలిసి నటించారు.. ఇప్పుడు కలిసి సినిమా చేశారు..
ఇరుముడిని మెచ్చిన మెగాస్టార్.. అదిరిపోయే ట్వీట్
ఇరుముడిని మెచ్చిన మెగాస్టార్.. అదిరిపోయే ట్వీట్
ఇరుముడి సూపర్ హిట్.. రూ.కోట్లలో జాక్ పాట్ కొట్టిన రవన్న
ఇరుముడి సూపర్ హిట్.. రూ.కోట్లలో జాక్ పాట్ కొట్టిన రవన్న
ప్రేమించింది.. పెళ్లి చేసుకోమంటూ వెంటపడింది.. పాపం ఆ యువకుడు..
ప్రేమించింది.. పెళ్లి చేసుకోమంటూ వెంటపడింది.. పాపం ఆ యువకుడు..
బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్! పాలకూర వడల సింపుల్ రెసిపీ ఇదిగో!
బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్! పాలకూర వడల సింపుల్ రెసిపీ ఇదిగో!
శుభకార్యానికి బయలుదేరినప్పుడు వెనుక నుంచి పిలిస్తే.. అశుభమా?
శుభకార్యానికి బయలుదేరినప్పుడు వెనుక నుంచి పిలిస్తే.. అశుభమా?
చల్లటి నీళ్లు తాగితే జలుబు చేస్తుందా?
చల్లటి నీళ్లు తాగితే జలుబు చేస్తుందా?
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా 5వేల స్పెషల్ బస్సులు
ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. రాష్ట్రవ్యాప్తంగా 5వేల స్పెషల్ బస్సులు
టార్గెట్‌ సురేఖేనా?.. ఖర్గే కోర్టులో తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ!
టార్గెట్‌ సురేఖేనా?.. ఖర్గే కోర్టులో తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ!
పరగడుపున వేడి నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా
పరగడుపున వేడి నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా