Telangana: తెలంగాణ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్.. నవంబర్‌లోగా అందరికీ ఉచిత అల్పాహారం
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత అల్పాహారం అందించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అమలవుతున్న ఈ పథకాన్ని అక్టోబర్ చివరి నాటికి అన్ని విద్యాసంస్థలకు చేరవేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ పనుల్లో జాప్యం జరిగినా నవంబర్ 15లోపు రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయిలో అల్పాహార పంపిణీ ప్రారంభించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
