ఎంత ముద్దుగుందో.. చూడనీకి రెండు కళ్లు చాలవే..

Samatha

27 August 2026

అందాల ముద్దుగుమ్మ నభానటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం.

ఈ బ్యూటీ తన గ్లామర్‌తో కుర్రకారు మనసు దోచుకుంది. చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలో ప్రతి ఒక్కరి మనసులో నిలిచి పోయింది.

నన్ను దోచుకుందువటే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ఇస్మార్ట్ శంకర్ మూవీతో యూత్ ఫేవరెట్ అయిపోయింది.

ఈ మూవీలో ఈ అమ్మడు నటనకు, గ్లామర్‌కు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. అంతలా తన అందచందాలతో ఈ ముద్దుగుమ్మ కుర్రకారును మాయ చేసింది.

ఈ మూవీ తర్వాత ఈ బ్యూటీ కెరీర్ దూసుకెళ్తుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఊహించిన రేంజ్‌లో ఈ అమ్మడు కెరీర్ సాగలేదని చెప్పాలి.

తర్వాత మ్యాస్ట్రో, డిస్కో రాజా, సోలో బతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్ వంటి చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. కానీ స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటలేకపోయింది.

ఇక ఇప్పటికీ ఈ బ్యూటీ పలు సినిమాల్లో నటిస్తూ తన అభిమానులకు పలకరిస్తుంది. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

తాజాగా ఈ బ్యూటీ ఓనం లుక్‌లో ఉన్న ఫొటోస్ షేర్ చేయగా, అవి కుర్రకాను తెగ ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట వైరల్‌గా మారాయి.