AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న పేదల బండి.. ఈ సూపర్ ట్రైన్ గురించి మీకు తెలుసా?

ఇండియన్ రైల్వే ఇప్పుడు ప్రపంచంలోనే మూడో అతి పెద్ద రైల్వే వ్యవస్థగా ఎదిగింది. వందేభారత్, అమృత్‌ భారత్ వంటి హైస్పీడ్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చినా.. తెలుగురాష్ట్రాల మధ్య నడిచే ఓ పేదల బండికి మాత్రం ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు.. 1977లో ప్రారంభమైన ఈ ట్రైన్.. 50 ఏళ్లుగా సేవలు అందిస్తూ ప్రయాణికులకు నుంచి విశిష్ట ఆదరణ పొందుతోంది. ఇంతకూ ఆ ట్రైన్ ఏదనేగా మీ డౌట్.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే.

Indian Railways: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న పేదల బండి.. ఈ సూపర్ ట్రైన్ గురించి మీకు తెలుసా?
Rayalaseema Express
Diwakar P
| Edited By: |

Updated on: Aug 27, 2026 | 9:46 PM

Share

తిరుపతి నుంచి నిజామాబాద్ మధ్య రాకపోకలు సాగించే రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 49 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుని తాజాగా 50వ ఏడాదిలోకి అడుగుపెట్టింది. 1977 సంవత్సరంలో మీటర్ గేజ్ పట్టాలపై సింగిల్ లైన్ సర్వీస్ గా సామాన్యులకు అందుబాటులోకి వచ్చిన ఈ రైలు 50 ఏళ్లుగా ప్రయాణికులు సూదీర్ఘ సేవలు అందించింది. అప్పట్లో దీనిని పేదల బండిగా పిలిచేవారు. కాలక్రమేనా ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా దీనిని హైదరాబాద్ నుండి నిజామాబాద్ వరకు పొడిగించారు. ఆ తర్వాత సూపర్ఫైస్ట్ ఎక్స్ప్రెస్గా అప్గ్రేడ్ చేసి ఆధునిక హంగులతో నడుపుతున్నారు.

తిరుపతి నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మీదుగా సుమారు 893 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు 16 గంటల్లో చేరుకుంటుంది. మూడు రాష్ట్రాల ప్రజలకు ఇది సుదీర్ఘకాలంగా ఆత్మీయ సేవలందిస్తోంది. ప్రయాణికుల విజ్ఞప్తి మేరకు, దక్షిణ మధ్య రైల్వే అధికారులు సికింద్రాబాద్ సమీపంలోని బొల్లారం రైల్వే స్టేషన్లో ఈ రైలుకు నిమిషం పాటు హాల్ట్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నో కొత్త వందేభారత్, సూపర్ఫాస్ట్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నప్పటికీ, సామాన్యులకు, తిరుమల శ్రీవారి భక్తులకు ఈ రైలుపై ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు

రాయలసీమ ఎక్స్‌ప్రెస్ తొలిసారిగా 1977 అక్టోబర్ 2న ప్రారంభమైంది. ప్రారంభంలో ఇది హైదరాబాద్–తిరుపతి మధ్య మాత్రమే నడిచేది. అప్పట్లో మీటర్ గేజ్ మార్గంలో సాధారణ ఎక్స్‌ప్రెస్‌గా ప్రారంభమైన ఈ రైలు ప్రస్తుతం తిరుపతి–నిజామాబాద్ మధ్య రాయలసీమ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12793/12794)గా నడుస్తోంది. 2017 నవంబర్ 1 నుంచి దీనిని సూపర్‌ఫాస్ట్‌గా మార్చి, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వరకు పొడిగించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
50 ఏళ్లు పూర్తి చేసుకున్న పేదల బండి.. ఈ ట్రైన్ గురించిమీకు తెలుసా
50 ఏళ్లు పూర్తి చేసుకున్న పేదల బండి.. ఈ ట్రైన్ గురించిమీకు తెలుసా
ప్రతి రోజు 50 మందికి భోజనం పెట్టేవారు..అలాంటి ఆయన చనిపోయారంటే..
ప్రతి రోజు 50 మందికి భోజనం పెట్టేవారు..అలాంటి ఆయన చనిపోయారంటే..
హోండా రెబల్‌ 300 క్రూయిజర్​ బైక్​.. ధర తెలిస్తే కళ్లుతిరుగుతాయి
హోండా రెబల్‌ 300 క్రూయిజర్​ బైక్​.. ధర తెలిస్తే కళ్లుతిరుగుతాయి
ఇచ్చిన డబ్బు తిరిగివ్వమన్నందుకు ఎలా చంపిందో తెలిస్తే..
ఇచ్చిన డబ్బు తిరిగివ్వమన్నందుకు ఎలా చంపిందో తెలిస్తే..
ఆ హీరో షర్ట్ మడతపెట్టే స్టైల్ అంటే పిచ్చి ఇష్టం..
ఆ హీరో షర్ట్ మడతపెట్టే స్టైల్ అంటే పిచ్చి ఇష్టం..
రన్నింగ్‌లో ఉన్న జాగ్వార్ కారులో భారీ శబ్ధం.. ఆపిన క్షణాల్లోనే
రన్నింగ్‌లో ఉన్న జాగ్వార్ కారులో భారీ శబ్ధం.. ఆపిన క్షణాల్లోనే
అన్నదమ్ములు ఇద్దరుంటే.. మొదటి రాఖీ ఎవరికి కట్టాలి?
అన్నదమ్ములు ఇద్దరుంటే.. మొదటి రాఖీ ఎవరికి కట్టాలి?
అప్పుడు కలిసి నటించారు.. ఇప్పుడు కలిసి సినిమా చేశారు..
అప్పుడు కలిసి నటించారు.. ఇప్పుడు కలిసి సినిమా చేశారు..
ఇరుముడిని మెచ్చిన మెగాస్టార్.. అదిరిపోయే ట్వీట్
ఇరుముడిని మెచ్చిన మెగాస్టార్.. అదిరిపోయే ట్వీట్
ఇరుముడి సూపర్ హిట్.. రూ.కోట్లలో జాక్ పాట్ కొట్టిన రవన్న
ఇరుముడి సూపర్ హిట్.. రూ.కోట్లలో జాక్ పాట్ కొట్టిన రవన్న