AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2031 వరకు కొత్త టోర్నీ లేనట్టే.. ఐసీసీకి షాకిచ్చిన బీసీసీఐ..?

అంతర్జాతీయ క్రికెట్ క్యాలెండర్‌లో కొత్త టోర్నమెంట్లకు చోటు కల్పించే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రయత్నాలకు ప్రస్తుతానికి బ్రేక్ పడింది. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ బోర్డుల వ్యతిరేకతతో కనీసం 2031 వరకు కొత్త మల్టీ టీమ్ టోర్నమెంట్‌ను ప్రారంభించకూడదనే నిర్ణయానికి ఐసీసీ వచ్చినట్టు నివేదికలు చెబుతున్నాయి.

2031 వరకు కొత్త టోర్నీ లేనట్టే.. ఐసీసీకి షాకిచ్చిన బీసీసీఐ..?
Bcci Vs Icc
Venkata Chari
|

Updated on: Oct 05, 2026 | 10:05 PM

Share

క్రికెట్ క్యాలెండర్‌లో ఇప్పటికే ఉన్న అంతర్జాతీయ టోర్నమెంట్లతో షెడ్యూల్ నిండిపోయింది. ఈ పరిస్థితుల్లో కొత్త పోటీలకు అవకాశం లేదని భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ స్పష్టం చేసినట్టు సమాచారం. దుబాయ్‌లో జరిగిన ఐసీసీ క్రికెట్ ఆపరేషన్స్ వర్క్‌షాప్‌లో ఈ అంశంపై నెలల పాటు చర్చలు జరిగినా, కొత్త టోర్నమెంట్ ప్రతిపాదన లేకుండానే సమావేశం ముగిసింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆదాయాన్ని పెంచే మార్గాలపై ఐసీసీకి మెకిన్సే అండ్ కంపెనీ వ్యూహాత్మక నివేదిక ఇచ్చినట్టు తెలుస్తోంది. అందులో భాగంగా టీ20 ఫ్రాంచైజీ జట్లతో వరల్డ్ క్లబ్ ఛాంపియన్‌షిప్ నిర్వహించడం, ఖాళీగా ఉన్న షెడ్యూల్ విండోల్లో నాలుగు దేశాల టీ20 టోర్నమెంట్లు ఏర్పాటు చేయడం వంటి ఆలోచనలు పరిశీలనకు వచ్చాయి.

ఈ ప్రతిపాదనలకు మూడు ప్రధాన క్రికెట్ బోర్డులు అభ్యంతరం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఆటగాళ్ల బిజీ షెడ్యూల్‌లో కొత్త టోర్నీలకు స్థలం లేదని అవి స్పష్టం చేశాయి. కొత్త పోటీని చేర్చాలంటే వన్డే ప్రపంచకప్, టీ20 ప్రపంచకప్ లేదా చాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రస్తుత ప్రధాన టోర్నమెంట్లలో ఏదో ఒకదాన్ని తగ్గించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. అలాంటి మార్పు సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తమైంది.

ఇక ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్‌లో వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC)కు సంబంధించి మార్పు వచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నుంచి డబ్ల్యూటీసీని 9 జట్లతో ఉన్న ప్రస్తుత ఫార్మాట్‌ నుంచి 12 జట్లకు పెంచే ఆలోచన ఉన్నట్టు సమాచారం. ఆఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్, జింబాబ్వేలను కూడా టెస్ట్ చాంపియన్‌షిప్ సైకిల్‌లో చేర్చే అవకాశం ఉంది. దీనిపై ఐసీసీ ఇంకా అధికారిక ప్రణాళికను సభ్య బోర్డులకు పంపలేదు.

2031 వరకు భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ తమ ద్వైపాక్షిక షెడ్యూళ్లను ఖరారు చేసుకున్నట్టు నివేదిక పేర్కొంది. 2027 ఇంగ్లిష్ సమ్మర్‌లో తదుపరి డబ్ల్యూటీసీ యాషెస్‌తో ప్రారంభం కానుంది. 2028 ఆరంభంలో ఇంగ్లండ్ భారత్‌లో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది. 2029లో భారత జట్టు ఐదు టెస్టుల కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది.

Follow Us
కబోర్డ్‌ ఓపెన్‌ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్‌ చూసి హడల్‌
కబోర్డ్‌ ఓపెన్‌ చేసిన మహిళ.. అందులో ఊహించని సీన్‌ చూసి హడల్‌
2031 వరకు కొత్త టోర్నీ లేనట్టే.. ఐసీసీకి షాకిచ్చిన బీసీసీఐ..?
2031 వరకు కొత్త టోర్నీ లేనట్టే.. ఐసీసీకి షాకిచ్చిన బీసీసీఐ..?
ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ను పరామర్శించిన దుబాయ్‌ రాజు
ఫ్లై దుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ను పరామర్శించిన దుబాయ్‌ రాజు
'దృశ్యం' ను మించి ట్విస్టులు.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
'దృశ్యం' ను మించి ట్విస్టులు.. OTTలో ఈ క్రైమ్ థ్రిల్లర్ చూశారా?
3 ఏళ్ల పగ వడ్డీతో తీర్చాల్సిందే.. వెస్టిండీస్‌పై భారత్‌కు పరీక్ష
3 ఏళ్ల పగ వడ్డీతో తీర్చాల్సిందే.. వెస్టిండీస్‌పై భారత్‌కు పరీక్ష
కొట్టేసిన చీరలను తిరిగి కొరియర్‌లో పంపిన దొంగలు..
కొట్టేసిన చీరలను తిరిగి కొరియర్‌లో పంపిన దొంగలు..
పేపర్‌వెయిట్‌ అనుకుని వాడాడు.. బాంబు అని తెలిసి షాకయ్యాడు
పేపర్‌వెయిట్‌ అనుకుని వాడాడు.. బాంబు అని తెలిసి షాకయ్యాడు
బైపోల్‌ కాదు.. బిగ్ ఫైట్! తమిళనాడులో హైఓల్టేజ్ పోరు!
బైపోల్‌ కాదు.. బిగ్ ఫైట్! తమిళనాడులో హైఓల్టేజ్ పోరు!
ఇందులో డబ్బులు దాస్తే డబుల్.. రూ.10 లక్షలకు రూ.20 లక్షలు..!
ఇందులో డబ్బులు దాస్తే డబుల్.. రూ.10 లక్షలకు రూ.20 లక్షలు..!
తుమ్మ పుల్ల..చిగుళ్ల బలానికి,నోటి దుర్వాసన నివారణకు ఇదొక్కటి చాలు
తుమ్మ పుల్ల..చిగుళ్ల బలానికి,నోటి దుర్వాసన నివారణకు ఇదొక్కటి చాలు