‘నిను వీడని నీడను నేనే’ రివ్యూ!
టైటిల్ : ‘నిను వీడని నీడను నేనే’ తారాగణం : సందీప్ కిషన్, అన్యా సింగ్, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ తదితరులు సంగీతం : ఎస్. ఎస్. తమన్ నిర్మాతలు : సందీప్ కిషన్, సుప్రియ కంచర్ల కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కార్తీక్ రాజు విడుదల తేదీ: 12-07-2019 సందీప్ కిషన్, అన్య సింగ్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కించిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. ఈ […]
టైటిల్ : ‘నిను వీడని నీడను నేనే’
తారాగణం : సందీప్ కిషన్, అన్యా సింగ్, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి, మురళీ శర్మ తదితరులు
సంగీతం : ఎస్. ఎస్. తమన్
నిర్మాతలు : సందీప్ కిషన్, సుప్రియ కంచర్ల
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కార్తీక్ రాజు
విడుదల తేదీ: 12-07-2019
సందీప్ కిషన్, అన్య సింగ్ హీరోహీరోయిన్లుగా దర్శకుడు కార్తీక్ రాజు తెరకెక్కించిన చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. ఈ మూవీ ద్వారా హీరో సందీప్ కిషన్.. నిర్మాతగా పరిచయం కాబోతున్నాడు. డిఫరెంట్ జోనర్‌తో హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో ఈ సమీక్షలో చూద్దాం.
కథ :
2035వ సంవత్సరంతో మొదలైన ఈ సినిమాలో సైకాలజీ ప్రొఫెసర్(మురళీ శర్మ) తను డీల్ చేస్తున్న ఓ విచిత్ర కేసు గురించి చెప్పడం మొదలు పెడతాడు. దానితో కథ 2013వ సంవత్సరానికి మారుతుంది. అర్జున్(సందీప్ కిషన్), మాధవి(అన్య సింగ్) భార్యాభర్తలు. హ్యాపీగా ఉంటున్న వారి జీవితం ఓ యాక్సిడెంట్ వల్ల అల్లకల్లోలం అయిపోతుంది. వీరికి ఆ యాక్సిడెంట్ తరువాత కొన్ని భయానక సంఘటనలు ఎదురవుతాయి. అద్దంలో చూసుకునేటప్పుడు వేరే వ్యక్తుల ముఖాలు కనబడతాయి. అసలు ఎవరు ఆ వ్యక్తులు.? వీరికి కనిపించడానికి గల కారణాలు ఏంటి.? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల అభినయం:
సినిమాకు ప్రధాన బలం హీరో సందీప్ కిషన్.. తనదైన శైలి నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. కామెడీ, హారర్, యాక్షన్, సెంటిమెంట్ ఇలా అన్ని ఎమోషన్స్‌ను అద్భుతంగా పండించాడు. ఇక హీరోయిన్ అన్య సింగ్‌కు తెలుగులో ఇది మొదటి సినిమానే అయినా మంచి మార్కులు సాధించింది. అందం, అభినయంతోనూ ప్రేక్షకులను అలరించింది. కథకు కీలక పాత్ర పోషించిన వెన్నెల కిషోర్.. మరోసారి తన మార్క్ కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించాడు. మురళి శర్మ, పోసాని కృష్ణ మురళి తదితరలు తమ పాత్రల పరిధి మేరకు చక్కటి నటన కనబరిచారు.
విశ్లేషణ :
దర్శకుడు కార్తీక్ రాజు ఎంచుకున్న ఇంటరెస్టింగ్ పాయింట్ చుట్టూ అల్లుకున్న కథ ఆసక్తికరంగా ఉంది. అయితే సస్పెన్స్ అంతా రెండో భాగంలో చూపించడంతో.. మొదటి భాగం కథ కాస్త నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్, ప్రీ క్రైమాక్స్, క్లైమాక్స్‌లను దర్శకుడు ఆసక్తికరంగా మలిచాడు. మరోవైపు ఈ సినిమాలో లాజిక్స్ కంటే సస్పెన్స్ మీద దృష్టి సారిస్తే బాగుంటుంది.
సాంకేతిక విభాగాల పనితీరు:
కార్తీక్ రాజు ఆసక్తికరమైన కథకు అద్భుతమైన సంగీతాన్ని జోడిస్తే సినిమా అద్భుతంగా ఉంటుంది. సరిగ్గా అలాగే ఎస్.ఎస్.థమన్ సూపర్బ్ మ్యూజిక్ అందించాడు. పాటలు ఓకే గానీ.. నేపధ్య సంగీతం మాత్రం సినిమా స్థాయిని పెంచింది. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ప్లస్ పాయింట్స్ :
- సందీప్ కిషన్
- నేపథ్య సంగీతం
- కథలో మలుపులు
మైనస్ పాయింట్స్ :
- లాజిక్ లేని సీన్స్
- సెకండ్ హాఫ్ కామెడీ