Rajamouli : ఆ హీరో చాలా గొప్పోడు.. సినిమా కోసం తన జీవితాన్నే ఇచ్చేశాడు.. రాజమౌళి కామెంట్స్..
పాన్ ఇండియా లెవల్లో తనదైన ముద్ర వేసిన డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి. ప్రస్తుతం వారణాసి చిత్రీకణలో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, జక్కన్న తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన మహేష్ గ్లింప్స్ మూవీపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేయగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ హీరో గురించి జక్కన్న చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని సంచలనం సృష్టించాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ అంకితభావం, “బాహుబలి” చిత్ర నిర్మాణ అనుభవాలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. వ్యక్తిగతంగా ప్రభాస్ బద్ధకస్తుడని, పెద్ద పెద్ద కోరికలు లేని ఈజీగోయింగ్ వ్యక్తి అని రాజమౌళి తెలిపారు. అయితే, తన పాత్ర లేదా సినిమా విషయానికి వస్తే, ప్రభాస్ ఎద్దులా కష్టపడతాడని, అసాధారణమైన నిబద్ధతను ప్రదర్శిస్తాడని ఆయన ప్రశంసించారు. “బాహుబలి” చిత్ర పాత్రల రూపకల్పనకు సంబంధించిన కీలక వివరాలను రాజమౌళి పంచుకున్నారు. బాహుబలి కథను తను పుట్టినప్పటి నుండి రాసుకున్నామని, ప్రతి పాత్రకు సంబంధించి సుమారు వెయ్యి ప్రశ్నలకు సమాధానాలు వెతికాయని ఆయన వివరించారు. “అమరేంద్ర బాహుబలి ఎలా పెరిగాడు. తనకు ఇష్టమైన రంగులేమిటి. ఏ సబ్జెక్టు ఇష్టం. తల్లికి, రాజ్యానికి ఎదురు వస్తే ఎవరి పక్షాన నిలబడతాడు.” వంటి ప్రశ్నలకు స్పష్టమైన జవాబులు తయారు చేసుకున్నామని తెలిపారు.
ఎక్కువ మంది చదివినవి : Jr.NTR : ఎన్టీఆర్ ఎక్కువగా వినే పాట ఇది.. నిజంగా జీవితం మొత్తాన్ని కళ్లు ముందు చూపించే సాంగ్.. యూట్యూబ్‌లో ట్రెండింగ్..
ఈ క్యారెక్టర్ డిజైనింగ్ ప్రక్రియలో ప్రభాస్ చురుకుగా పాల్గొన్నారు. రాజమౌళి చెబుతున్న విషయాలను ప్రశ్నిస్తూ, “మీరు ఇంతకుముందు అలా అన్నారు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా చెబుతున్నారు. అమరేంద్ర బాహుబలి అలా ఎలా చేస్తాడు. ప్రిన్స్‌గా పెరిగినవాడు అలా ఎందుకు మాట్లాడతాడు.” అంటూ చర్చలు, వాదనలకు దిగేవారని రాజమౌళి గుర్తు చేసుకున్నారు. రాత్రంతా కలిసి కూర్చొని పాత్ర గురించి చర్చించేవారని, ప్రభాస్ తన మనస్సులో పాత్రను నిరంతరం బేరీజు వేసుకుంటూ, కొత్త ఆలోచనలతో వచ్చేవాడని ఆయన అన్నారు. “ఈ క్యారెక్టర్ ఇలా ప్రవర్తించాలి, బాడీ లాంగ్వేజ్ ఇలా ఉండాలి, శివుడు కన్ను ఆర్పుతాడు కానీ అమరేంద్ర బాహుబలి కన్ను ఆర్పడు” వంటి సూక్ష్మమైన వివరాలను కూడా ప్రభాస్ స్వయంగా వర్కౌట్ చేసుకునేవారని రాజమౌళి వివరించారు. ఈ అంకితభావం సినిమా ఐదేళ్ల నిర్మాణ కాలం మొత్తం కొనసాగిందని, అది కేవలం శారీరక నిర్మాణం మాత్రమే కాదని, “ప్రభాస్ తన జీవితాన్ని ఈ పాత్రకు ధారపోశాడని” రాజమౌళి పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : ప్రకాష్ రాజ్ సినిమాలో ఛాన్స్ అన్నారు.. ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. టాలీవుడ్ నటి..
“బాహుబలి 2” ముంబై ప్రెస్ మీట్‌లో ప్రభాస్‌కు లభించిన అపూర్వ స్పందనను రాజమౌళి ప్రత్యేకంగా ప్రస్తావించారు. 400 సీట్ల థియేటర్‌లో ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్ల ప్రెస్ మీట్‌లకు కూడా 50% మంది మీడియా మాత్రమే వస్తారని, అయితే బాహుబలి 2 ప్రెస్ మీట్‌కు థియేటర్ మొత్తం హిందీ మీడియా ప్రతినిధులతో నిండిపోయిందని ఆయన ఆశ్చర్యంగా తెలిపారు. ప్రభాస్ స్టేజ్ ఎక్కుతుండగానే స్టాండింగ్ ఒవేషన్ లభించిందని, అభిమానులు ఎలా అయితే సెల్ఫీలు తీసుకోవడానికి ఎగబడతారో, అలాగే హిందీ మీడియా ప్రతినిధులు కూడా ప్రభాస్‌తో సెల్ఫీలు తీసుకోవడానికి పోటీ పడ్డారని రాజమౌళి గుర్తు చేసుకున్నారు. “బాహుబలి 1” ప్రెస్ మీట్‌లో తనతోనూ, రానాతోనూ ఫోటోలు తీసుకునేవారని, కానీ “బాహుబలి 2” నాటికి ప్రభాస్ తప్ప మరెవ్వరూ అక్కడ లేరని ఆయన వివరించారు. ప్రజలకు ప్రభాస్ గురించి ఏమీ తెలియదని, వారు కేవలం బాహుబలి పాత్రను మాత్రమే చూశారని, ఆ పాత్రను ప్రభాస్ తప్ప మరెవ్వరూ అంత అద్భుతంగా చేయలేరని రాజమౌళి అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Mahesh Babu: మహేష్ బాబును అన్నయ్య అని పిలిచిన ఏకైక హీరోయిన్.. హీరో రియాక్షన్ తెలిస్తే..
ప్రభాస్ ఫోటో..

Prabhas
ఎక్కువ మంది చదివినవి : Sravana Bhargavi: ఇద్దరి మధ్య చిన్న చిన్న గొడవలు కామన్.. కానీ చివరకు.. తల్లి కూతురు మధ్యలో అలాంటివి.. శ్రావణ భార్గవి..
