AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఆర్మీ ఆఫీసర్ కావాలనుకున్నాడు.. కట్ చేస్తే ఇప్పుడు టాలీవుడ్‌లో హ్యాండ్సమ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?

ఇతను మొదట సినిమాల్లోకి రావాలని అసలు అనుకోలేదు. ఆర్మీ ఆఫీసర్ కావాలని చిన్నప్పటి నుంచే కలలు కన్నాడు. అందుకు తగ్గట్టుగానే చదువుతో పాటు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) కార్యకలాపాల్లో చాలా చురుకుగా ఉండేవాడు. ఆర్మీ కోసం కఠిన శిక్షణ కూడా తీసుకున్నాడు.. కానీ..

Tollywood: ఆర్మీ ఆఫీసర్ కావాలనుకున్నాడు.. కట్ చేస్తే ఇప్పుడు టాలీవుడ్‌లో హ్యాండ్సమ్ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
Tollywood Actor
Basha Shek
|

Updated on: May 14, 2026 | 7:50 PM

Share

పై ఫొటోలో బక్కగా కనిపిస్తోన్న అబ్బాయిని గుర్తు పట్టారా? ఇప్పుడితను దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఫేమస్ హీరో. కానీ ఈ నటుడికి పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉంది. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళం, ఇంగ్లిష్.. ఇలా ఎన్నో భాషల్లో సినిమాలు చేశాడు. తన నటనతో స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ హీరోగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలాగే ప్రేమకథా చిత్రాలతో అమ్మాయిలకు ఫేవరెట్ హీరోగా మారిపోయాడు. అప్పుడెప్పుడో 1990లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఇతను ఇప్పటికీ సినిమాలు చేస్తున్నాడు. అయితే గతంలోలా హీరో పాత్రలు చేయట్లేదు కానీ అంతకుమించిన పవర్ ఫుల్ పాత్రలనే ఎంచుకుంటున్నాడు. కొన్ని సినిమాల్లో విలన్ గా కనిపిస్తే మరికొన్ని సినిమాల్లో దెయ్యంగా యాక్ట్ చేస్తున్నాడు. కమర్షియల్ హంగులకు దూరంగా ఉండే సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. నిజ జీవితంలో ఆర్మీ ఆఫీసర్ అవ్వాలని కలలు కన్న ఈ నటుడు ఇటీవల రీల్ లైఫ్ లో ఆ కలను సాకారం చేసుకున్నాడు. ఇటీవల బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఓ సినిమాలో పవర్ ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో అద్బుతంగా నటించి అందరి మన్ననలు అందుకున్నాడు. రెండు భాగాలుగా రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ 3000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించడం విశేషం. ఈ పాటికే చాలా మందికి అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు చాక్లెట్ బాయ్ మాధవన్ అలియాస్ మ్యాడీ.

ఆదిత్య ధర్ తెరకెక్కిచిన ధురంధర్, ధురంధర్ ది రివేంజ్ సినిమాల్లో మాధవన్ ఓ కీలక పాత్రలో కనిపించారు. ఐబీ చీఫ్ అజయ్ సన్యాల్ పాత్రలో అందరి మన్ననలు అందుకున్నారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ స్ఫూర్తితో ఈ పాత్రను రూపొందించాడు డైరెక్టర్. కాగా నిజ జీవితంలోనూ ఆర్మీ ఆఫీసర్ కావాలనుకున్నారు మాధవన్. ఆ దిశగా శిక్షణ కూడా పొందారు. తన కాలేజ్ డేస్ లోనే నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో చాలా చురుకుగా ఉండే వాడు మాధవన్. మహారాష్ట్ర నుంచి ఉత్తమ NCC క్యాడెట్‌గా గుర్తింపు పొందారు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌లో బ్రిటిష్ ఆర్మీ, రాయల్ నేవీ, రాయల్ ఎయిర్ ఫోర్స్‌తో శిక్షణ పొందే అరుదైన అవకాశం లభించింది. ఇండియన్ ఆర్మీలో చేరడానికి ఆయన అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినా వయసు పరిమితి తో తన కలను సాకారం చేసుకోలేకపోయారు మాధవన్. దీంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. భారతదేశం గర్వించదగ్గ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

ధురంధర్ ది రివేంజ్ సినిమాలో మాధవన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us